మళ్లీ ఒట్టుపెట్టిన రేవంత్.. ఈసారి ఎవరిపైనంటే..?

రేవంత్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ సెటైర్లు వేస్తున్నా కూడా మరోసారి రుణమాఫీ విషయంలో ఒట్టుపెట్టారు.

Advertisement
Update: 2024-04-27 16:52 GMT

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ ప్రాంతాలకు వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆయా ప్రాంతాల్లో దేవుళ్లపై ఒట్లు వేయడం చూస్తూనే ఉన్నాం. ఆగస్ట్-15లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతానని, దేవుడిపై ఒట్టు అంటూ ఆయన ప్రమాణాలు చేస్తున్నారు. ఈ ప్రమాణాల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఆయన తాజాగా మరోసారి ఒట్టు పెట్టారు. ఈసారి హైదరాబాద్ పెద్దమ్మతల్లిపై ఒట్టుపెట్టి మరీ తాను రుణమాఫీ చేసి తీరుతానన్నారు.


రేవంత్ రెడ్డి ప్రమాణాలను బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. దేవుడిపై ఒట్టు పెడితే సులభంగా తప్పించుకోవచ్చని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని, ఆయనకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కుటుంబ సభ్యులపై ఒట్టు వేయాలని డిమాండ్ చేశారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ సెటైర్లు వేస్తున్నా కూడా మరోసారి రుణమాఫీ విషయంలో ఒట్టుపెట్టారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి సాక్షిగా తాను అన్నదాతలకు హామీ ఇస్తున్నానని, ఆగస్ట్-15లోపు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ అమలు చేసి తీరతానన్నారు రేవంత్ రెడ్డి.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలు కీలక అంశంగా మారాయి. హామీలు అమలు చేయలేదని ప్రతిపక్ష బీఆర్ఎస్, కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తుండగా.. ఇప్పటికే చాలా చేశామని, రుణమాఫీ లాంటివి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఆలస్యమయ్యాయని కాంగ్రెస్ వాదిస్తోంది. ఈ క్రమంలో హరీష్ రావు, రేవంత్ రెడ్డి మధ్య సవాళ్ల యుద్ధం కూడా నడుస్తోంది. అదే సమయంలో రేవంత్ రెడ్డి కనపడిన దేవుడిపైనల్లా ఒట్టుపెట్టి రుణమాఫీ గ్యారెంటీ అని ప్రజలకు మాటిస్తున్నారు. ఈ తిట్లు, ఒట్లు, సవాళ్లు.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. 

Tags:    
Advertisement

Similar News