సీఎంవో అధికారులపై బదిలీ వేటు

ఏపీ కొత్త సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసిన గంట వ్యవధిలోనే సీఎంవో కార్యాలయం అధికారులపై బదిలీ వేటు పడింది. గత ప్రభుత్వం హయాంలో చంద్రబాబు కోర్ టీంగా పని చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారులను తక్షణమే బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. చంద్రబాబుకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సతీష్ చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, సీఎం కార్యదర్శి గిరిజా శంకర్, మరో కార్యదర్మి రాజమౌళిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్యులు జారీ చేసింది. […]

Advertisement
Update: 2019-05-30 06:49 GMT

ఏపీ కొత్త సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసిన గంట వ్యవధిలోనే సీఎంవో కార్యాలయం అధికారులపై బదిలీ వేటు పడింది. గత ప్రభుత్వం హయాంలో చంద్రబాబు కోర్ టీంగా పని చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారులను తక్షణమే బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

చంద్రబాబుకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సతీష్ చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, సీఎం కార్యదర్శి గిరిజా శంకర్, మరో కార్యదర్మి రాజమౌళిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్యులు జారీ చేసింది. వారిని సాధారణ పరిపాలనా శాఖకు వెంటనే రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

వీరంతా సీనియర్ ఐఏఎస్ అధికారులే కాక చంద్రబాబుకు సన్నిహితులనే పేరుంది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోపైపు కొత్త ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా ధనుంజయ్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Tags:    
Advertisement

Similar News