కుప్పంలో నోటాకు అన్ని ఓట్లా?

చంద్రబాబు పాలనపై ఏపీ ప్రజలు ఎంత విసిగి వేసారి పోయారనడానికి మొన్నటి ఫలితాలే నిదర్శనం.. కంచుకోటగా మలుచుకున్న చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కూడా మొదటి రౌండ్ లో చంద్రబాబు వెనుకబడ్డాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో పుంగనూరు, కుప్పం, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో నోటాకు వరుసగా 3287, 2905, 2886 ఓట్లు పడ్డాయి. తిరుపతి, పలమనేరును పక్కనపెడితే ఎక్కువ ఓట్లు నోటాకు పడడం ఆశ్చర్యపరుస్తోంది. ఎన్నికల్లో ఏ అభ్యర్ధీ నచ్చకపోతే నోటాకు అత్యధికంగా పడుతుంటాయి. […]

Advertisement
Update: 2019-05-26 00:09 GMT

చంద్రబాబు పాలనపై ఏపీ ప్రజలు ఎంత విసిగి వేసారి పోయారనడానికి మొన్నటి ఫలితాలే నిదర్శనం.. కంచుకోటగా మలుచుకున్న చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కూడా మొదటి రౌండ్ లో చంద్రబాబు వెనుకబడ్డాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో పుంగనూరు, కుప్పం, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో నోటాకు వరుసగా 3287, 2905, 2886 ఓట్లు పడ్డాయి.

తిరుపతి, పలమనేరును పక్కనపెడితే ఎక్కువ ఓట్లు నోటాకు పడడం ఆశ్చర్యపరుస్తోంది.

ఎన్నికల్లో ఏ అభ్యర్ధీ నచ్చకపోతే నోటాకు అత్యధికంగా పడుతుంటాయి. ఈ పరిస్థితి చిత్తూరు జిల్లాలో ఎక్కువగా కనిపించింది.

ఎన్నికల కమిషన్ తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం ఈ ఏడాది దేశవ్యాప్తంగా 31వేల మంది ఓటర్లు నోటాకు వేశారు. 2014తో పోల్చితే ఇది చాలా ఎక్కువ. అప్పుడు కేవలం 10411మంది మాత్రమే నోటాకు వేయగా. ఈసారి ఆ సంఖ్య మూడు రెట్లకు పెరిగింది.

ఇక చంద్రబాబు నియోజకవర్గంలోనూ ఏకంగా 2905 మంది నోటాకు వేశారంటే బాబు సహా ప్రత్యర్థి నచ్చలేదని అర్థమవుతోంది. ఒక్క బాబు నియోజకవర్గంలోనే 3వేల మంది వరకు నోటాకు ఓటు వేశారంటే దాదాపు 10శాతం కుప్పంలోనే అలా పడడం గమనార్హం. ఈ లెక్కన చంద్రబాబే కాదు.. ప్రత్యర్థి కూడా నచ్చనంత వ్యతిరేకత చంద్రబాబు నియోజకవర్గంలో ఉండడం విశేషం.

Tags:    
Advertisement

Similar News