కమలం.... వాడి పోనుందా ?

భారతీయ జనతాపార్టీ ఆత్మరక్షణలో పడిందా? దేశంలో ఇప్పటికే మూడు దశల ఎన్నికలు పూర్తి అయ్యాయి. సగానికి పైగా సీట్లకు పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసిన చోట బీజేపీ పరిస్థితి అంత ఆశాజనకంగా ఏమీ లేదని అంటున్నారు. ఆ పార్టీకి 200 సీట్లలోపే వచ్చే అవకాశం ఉందని కొందరు రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఈ అంశమే  కమలనాథులను ఆందోళనకు గురి చేస్తోందని అంటున్నారు. అధికార పీఠాన్ని తిరిగి సొంతం చేసుకోవడం అంత సులభం కాదనే విషయం వారికి అర్థం అయ్యిందనే […]

Advertisement
Update: 2019-04-24 23:05 GMT

భారతీయ జనతాపార్టీ ఆత్మరక్షణలో పడిందా? దేశంలో ఇప్పటికే మూడు దశల ఎన్నికలు పూర్తి అయ్యాయి. సగానికి పైగా సీట్లకు పోలింగ్ జరిగింది.

పోలింగ్ ముగిసిన చోట బీజేపీ పరిస్థితి అంత ఆశాజనకంగా ఏమీ లేదని అంటున్నారు. ఆ పార్టీకి 200 సీట్లలోపే వచ్చే అవకాశం ఉందని కొందరు రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఈ అంశమే కమలనాథులను ఆందోళనకు గురి చేస్తోందని అంటున్నారు. అధికార పీఠాన్ని తిరిగి సొంతం చేసుకోవడం అంత సులభం కాదనే విషయం వారికి అర్థం అయ్యిందనే అంటున్నారు.

మమతా బెనర్జీలాంటి వారు ఫెడరల్ ఫ్రంట్ పాట ఎత్తుకోవడం కూడా వారిని ఆలోచనలో పడేస్తోంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లో మమత కమ్యూనిస్టులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారనే వార్తలు వస్తున్నాయి. రేపు ఫలితాలు వచ్చాక ఇటు బీజేపీకిగానీ, అటు కాంగ్రెస్ కు గానీ సంపూర్ణ మెజారిటీ రాకపోతే ప్రాంతీయ పార్టీలు కీలకం అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పుడు తమకు వచ్చే కొద్ది సీట్లతో అయినా కమ్యూనిస్టులు ఫెడరల్ ఫ్రంటుకు మద్దతు పలికే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

అసలు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు ఈసారి కూడా తమకు తిరుగులేని విజయం లభిస్తుందని బీజేపీ అధి నాయకులు భావించారు. కానీ, నోటిఫికేషన్ విడుదల అయ్యాక పరిణామాలు మారుతూ వచ్చాయి. కాంగ్రెస్ కొద్ది కొద్దిగా పుంజుకున్నట్టుగా కనిపించింది అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల పట్టు సడల లేదన్నది కూడా స్పష్టమైందంటున్నారు.

ఇవన్నీ చూశాకే కమలనాధుల గుండెల్లో గుబులు మొదలైందని అంటున్నారు. నిజానికి బీజేపీ ఉత్తరాది మీదనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. అందులో ముఖ్యమైనది ఉత్తరప్రదేశ్. అయితే, అక్కడ ములాయంసింగ్ యాదవ్, మాయావతి ఈసారి గట్టి పోటీనే ఇస్తున్నారు. ఎప్పుడూ ఉప్పూ నిప్పులా ఉండే వీరిద్దరూ కలిసిపోవడం కూడా బీజేపీకి మింగుడుపడని విషయమే.

రాజస్థాన్, అస్సాం, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ముందంజలో ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ముఖ్యమైన రాష్ట్రాలలో బలహీనం కావడం కాషాయ పార్టీకి ఒక రకంగా ఇబ్బందికరమేనని అంటున్నారు. ఇంకా నాలుగు దశల ఎన్నికలు ఉన్నాయి. కానీ…. పోలింగ్ జరగాల్సిన సీట్లు మాత్రం తక్కువగానే ఉన్నాయి. తమ బలహీనలతలను కమలనాథులు ఎలా అధిగమిస్తారో చూడాలి మరి‌‌!

Tags:    
Advertisement

Similar News