నక్క జిత్తులు.... తెల్ల పంచెలు కడుతున్న తెలుగు తమ్ముళ్లు?

అచ్చం… 2014 ఫార్ములానే మళ్లీ ఫాలో అయ్యేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. వైఎస్ విజయమ్మ విశాఖ ఎంపీగా గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆమెను ఓడించేందుకు … విజయమ్మ గెలిస్తే రాయలసీమ వాళ్లు విశాఖ వచ్చి కబ్జా చేస్తారని ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మేలా అర్ధరాత్రి దాటిన తర్వాత టీడీపీ వాళ్లే తెల్లపంచెలు కట్టుకుని వీధుల్లో గుంపులు గుంపులుగా తిరిగేవారు. అప్పట్లో నిజాలు తెలుసుకునే సమయం ప్రజలకు లేకపోవడంతో…. ఆ ప్రచారాన్ని నమ్మిన జనం కూడా ఉన్నారు. దాంతో విజయమ్మను ఓడించగలిగారు. […]

Advertisement
Update: 2019-03-30 21:49 GMT

అచ్చం… 2014 ఫార్ములానే మళ్లీ ఫాలో అయ్యేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. వైఎస్ విజయమ్మ విశాఖ ఎంపీగా గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆమెను ఓడించేందుకు … విజయమ్మ గెలిస్తే రాయలసీమ వాళ్లు విశాఖ వచ్చి కబ్జా
చేస్తారని ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మేలా అర్ధరాత్రి దాటిన తర్వాత టీడీపీ వాళ్లే తెల్లపంచెలు కట్టుకుని వీధుల్లో గుంపులు గుంపులుగా తిరిగేవారు.

అప్పట్లో నిజాలు తెలుసుకునే సమయం ప్రజలకు లేకపోవడంతో…. ఆ ప్రచారాన్ని నమ్మిన జనం కూడా ఉన్నారు. దాంతో విజయమ్మను ఓడించగలిగారు. ఈ ఫార్ములా విజయవంతమైన నేపథ్యంలో… ఇప్పుడు మరోసారి అదే ప్రచారానికి తెలుగు దేశం
సిద్ధమవుతోంది.

కార్యకర్తలకు తెల్లపంచెలు కట్టించి వీధుల్లో తిప్పడం ద్వారా వారంతా రాయలసీమ వాళ్లే… గొడవ చేసేందుకు వచ్చారని నమ్మించేందుకు ప్రణాళిక రచిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ ఇస్తున్న టీవీ ప్రకటనలు కూడా ఇదే తరహాలో ఉండడం గమనార్హం. బోయపాటి శీను దర్శకత్వంలో టీడీపీ ప్రకటనలను తయారు చేస్తోంది. కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను భయాందోళనకు గురి చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు.

ఈ తెల్లపంచెల ప్రచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. వైసీపీ వాళ్లు కూడా ఇలాంటి గుంపులు కనిపిస్తే వారిని గుర్తించి… వారు ఎక్కడి వారు, ఏ పార్టీ వారు అన్నది తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారు.

మొత్తం మీద ఎన్నికల పోలింగ్ తేదీ సమీపించే కొద్ది టీడీపీ అనేక ఊహించని, చరిత్రల్లో ఎన్నడూ చూడని విపరీత పరిణామాలను
సృష్టించేందుకు, ప్రచారం చేసేందుకు కూడా వెనుకాడకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్పటికే టీడీపీకి చెందిన ఒక పత్రిక నిత్యం ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేలా, పుకార్లు సృష్టించేలా తప్పుడు కథనాలను బహిరంగంగానే రాస్తూ ఉద్రిక్త పరిస్థితులను సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి ప్రచారానికి ఈసీ కూడా అడ్డుకట్ట వేయలేకపోవడం చర్చనీయాంశమైంది.

Advertisement

Similar News