ఆ ధైర్యం నీకుందా బాబూ..! జగన్ సూటి ప్రశ్న

తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరా సుమతి అన్నట్టుగా.. ఎన్నికలు వస్తుంటే మన రాష్ట్రానికి పొత్తుల నాయకులు వస్తున్నారని.. చంద్రబాబు కానీ, దత్తపుత్రుడు కానీ, వదినమ్మ కానీ ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్నారా? అని ప్రశ్నించారు జగన్.

Advertisement
Update: 2024-04-28 17:54 GMT

సిద్ధంతో ప్రత్యర్థుల గుండెల్లో వణుకు మొదలైంది..

మేమంతా సిద్ధం బస్సు యాత్రతో కూటమి కుదేలైంది..

తాజాగా జరుగుతున్న జగన్ సభలతో వేడి మరింత పెరిగింది..

మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ఎన్నికల ప్రచారంలో మరింత స్పీడ్ పెంచారు సీఎం జగన్. రోజుకి మూడు ప్రాంతాల్లో సభలకు హాజరవుతూ ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అసలు చంద్రబాబు ఏపీకి ఏం చేశారని, ఆయనకు ఎందుకు ఓటు వెయ్యాలంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు జగన్.


"అయ్యా చంద్రబాబూ.. 2014-19 మధ్య నీ పాలనలో జన్మభూమి కమిటీలు పెట్టావు. 2019లో మేము అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం. మరి నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల మీద నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్లీ అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పే ధైర్యం నీకుందా...?" అని ప్రశ్నించారు జగన్..

వచ్చే రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతోందని, ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని, బాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపేనని చెప్పారు జగన్. నాన్ లోకల్ కిట్టీ పార్టీ సభ్యులకు.. ఈస్ట్ ఇండియా కంపెనీ సభ్యులకు రాష్ట్రాన్ని దోచుకోవడమే పని అని విమర్శించారు. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరా సుమతి అన్నట్టుగా.. ఎన్నికలు వస్తుంటే మన రాష్ట్రానికి పొత్తుల నాయకులు వస్తున్నారని.. చంద్రబాబు కానీ, దత్తపుత్రుడు కానీ, వదినమ్మ కానీ ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్నారా? అని ప్రశ్నించారు జగన్. ఎన్నికలు వచ్చాయి కాబట్టే చంద్రబాబు కూటమి ఆంధ్రరాష్ట్రానికి వచ్చారని, ఓడిన వెంటనే మళ్లీ హైదరాబాద్‌కి వెళ్లిపోతారని, చంద్రబాబు కూటమి అంటే నాన్ లోకల్ కిట్టీపార్టీ, నయా ఈస్టిండియా కంపెనీ అని ఎద్దేవా చేశారు. తాను చంద్రబాబు లాగా సెల్ ఫోన్ కనిపెట్టానని బడాయిలు చెప్పడం లేదని, గత ఐదేళ్లలో కొత్తగా ఐదారు వ్యవస్థలు తీసుకు వచ్చి మీకు చూపించగలిగానన్నారు జగన్. ప్రజల కళ్ళ ముందే ఆ వ్యవస్థలు ఉన్నాయని, అవన్నీ కొనసాగాలంటే వైసీపీకే మళ్లీ ఓటు వేయాలని సూచించారు. తాను పేదలకు మేలు చేశాననే నమ్మకం ఉంటేనే ఓటు వేయాలన్నారు.

ప్రజల్ని 2014లో మేనిఫెస్టోతో దారుణంగా మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు సూపర్-6 అంటున్నారని, ఆయన్ను ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు జగన్. మోసాలు, అబద్ధాలతో ఈరోజు మనమంతా యుద్ధం చేస్తున్నామని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News