ఈసీపై రాజకీయ బురద.. ఈనాడు బరితెగింపు

ఆ ఇద్దర్నీ బదిలీ చేయలేదంటూ ఈసీకి రాజకీయాలు ఆపాదిస్తోంది. టీటీడీ ఈవో ధర్మారెడ్డి డిప్యుటేషన్ పొడిగింపు కూడా ఎల్లో మీడియాకి కంటగింపుగా మారింది.

Advertisement
Update: 2024-04-29 02:19 GMT

ఎన్నికల వేళ ఎల్లో మీడియా బరితెగింపు తారా స్థాయికి చేరుకుంది. చివరకు ఎన్నికల కమిషన్ కి కూడా రాజకీయాలను ఆపాదిస్తోంది ఈనాడు. ఈసీని కూడా తాను డిక్టేట్ చేయాలనుకుంటున్నారు రామోజీ రావు. కొన్నిరోజులుగా అధికారులను బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ కథనాలు రాస్తున్న ఈనాడు, ఈరోజు ఈసీని కూడా బెదిరిస్తూ అలాంటి మరో కథనాన్ని రాసుకొచ్చింది.

"రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు." అని ఈనాడు తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. మరి మిగతా అధికారులు, కొన్ని జిల్లాల ఎస్పీలను బదిలీ చేసినప్పుడు ఈ తపన ఏమైంది..? "అప్పుడు ఈసీ నిర్ణయాలు ఆహా, ఓహో.. ఇప్పుడు మాత్రం ఈసీ తప్పు చేస్తోంది, పక్షపాతం చూపిస్తోంది.." ఇదీ ఎల్లో మీడియా వరస. ఎవరిని బ్లాక్ మెయిల్ చేయడానికి ఈ కథనాలు..? ఎవరి రాజకీయ లబ్ధికోసం ఈ వార్తలు..?

ఎన్నికల నిర్వహణతో సంబంధం ఏమాత్రం ఉండని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై కూడా బదిలీ వేటు పడేలా చేశాయి ప్రతిపక్షాలు. పదే పదే బీజేపీ, టీడీపీ, జనసేన నేతల ఫిర్యాదులు.. ఢిల్లీ స్థాయిలో జరిపిన లాబీయింగ్ తో ఈ బదిలీలన్నీ జరిగాయనుకోవచ్చు.. కానీ ఏపీ సీఎస్, డీజీపీని మాత్రం ఈసీ కదిలించలేదు. దీంతో కూటమికి తల కొట్టేసినట్టయింది. ముఖ్యంగా ఎల్లో మీడియాకు కడుపుమండిపోయింది. వారిని కూడా బదిలీ చేస్తే.. ఏపీలో తాము ఆడింది ఆట, పాడింది పాటగా ఎన్నికలు జరుపుకోవచ్చు. ఈసీ బదిలీ చేసింది కాబట్టి అక్కడ ఏదో తప్పు జరిగిపోయిందని, నైతిక విజయం తమదేనని డబ్బా కొట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ అవకాశం లేదు కాబట్టి ఈనాడు తెగ ఇదైపోతోంది. అందుకే ఆ ఇద్దర్నీ బదిలీ చేయలేదంటూ ఈసీకి రాజకీయాలు ఆపాదిస్తోంది. టీటీడీ ఈవో ధర్మారెడ్డి డిప్యుటేషన్ పొడిగించడం కూడా ఎల్లో మీడియాకి కంటగింపుగా మారింది. 

Tags:    
Advertisement

Similar News