జగన్ సభలు.... బాబు గుండెల్లో గుబులు

జగన్ ఎన్నికల సభలు… బాబు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాలో జగన్ సభ జరిగినా ఆ జిల్లా తెలుగుదేశం నాయకులకు చెమటలు పట్టిస్తున్నాయంటున్నారు. మండల కేంద్రమైన నర్సీపట్నంలో వైఎస్ జగన్ సభకు ప్రభంజనంలా వెల్లువెత్తిన జనం… కావలిలోనూ పోటెత్తిన జన సందోహం…. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి సభలకు హాజరవుతున్న ప్రజలను చూసి తెలుగుదేశం పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అంటున్నారు. లక్ష జనాభా కూడా లేని […]

Advertisement
Update: 2019-03-22 09:20 GMT

జగన్ ఎన్నికల సభలు… బాబు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాలో జగన్ సభ జరిగినా ఆ జిల్లా తెలుగుదేశం నాయకులకు చెమటలు పట్టిస్తున్నాయంటున్నారు.

మండల కేంద్రమైన నర్సీపట్నంలో వైఎస్ జగన్ సభకు ప్రభంజనంలా వెల్లువెత్తిన జనం… కావలిలోనూ పోటెత్తిన జన సందోహం…. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి సభలకు హాజరవుతున్న ప్రజలను చూసి తెలుగుదేశం పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అంటున్నారు.

లక్ష జనాభా కూడా లేని మండల కేంద్రాలలో వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలకు వస్తున్న జనంపై ఇంటెలిజెన్స్ విభాగం ఎప్పటికప్పుడు నివేదికలను రూపొందిస్తోంది. వీటిని అధికార తెలుగుదేశం పార్టీ నాయకులకు అందజేస్తున్నాయంటున్నారు.

ఈ సభలకు వస్తున్న ప్రజల స్పందన పై ఇంటెలిజెన్స్ అధికారులు పూర్తి స్దాయిలో నివేదికలు ఇస్తున్నారని అధికార పార్టీకి చెందిన నాయకులు చెబుతున్నారు. ఈ నివేదికలపై సమీక్షలు జరుపుతున్న చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ప్రచార సభలకు వస్తున్న ప్రజల సంఖ్య కంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పుడు వారి నుంచి వచ్చే స్పందన అనూహ్యంగా ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి.

తెలుగుదేశం పార్టీ అభ్యర్దుల గెలుపు కోసం ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బహిరంగ సభలలో పాల్గొంటున్నా ఆయనకు వస్తున్న మద్దతు మాత్రం అంతంత మాత్రంగానే ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలో వెల్లడైంది. ప్రభుత్వ పథకాలపై చంద్రబాబు నాయుడు తన ప్రసంగాలలో వివరిస్తున్నా ప్రజల నుంచి మాత్రం పెద్దగా స్పందన ఉండడం లేదని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి.

గతంలో ప్రజారాజ్యం అధ్యక్షుడు మెగా స్టార్ చిరంజీవి బహిరంగ సభలకు కూడా విశేషంగా ప్రజలు వచ్చారని తెలుగుదేశం నాయకుడు సమాధానం చెబుతున్నా….. ఆ సభలకు, జగన్ ఎన్నికల ప్రచార సభలకు పొంతన లేదని ఇంటెలిజెన్స్ అధికారులు చంద్రబాబుకు స్పష్టం చేసినట్టు చెబుతున్నారు.

ప్రభుత్వ వ్యతిరేకతను సభలకు హాజరవుతున్న ప్రజలు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారని…. ఇది ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశం అని అంటున్నారు.

చంద్రబాబు నాయుడు తన బహిరంగ సభలలో ప్రజల నుంచి స్పందన కోసం పదే పదే కోరుతున్నా వారినుంచి ఎలాంటి స్పందన రావటం లేదని కూడా ఇంటెలిజెన్స్ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. మొత్తానికి జగన్ సభలు అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News