ఏపీ హైకోర్టులో జగన్‌ కేసు తొలిసారి నేడు విచారణ

జగన్‌పై హత్యాయత్నానికి సంబంధించిన కేసు నేడు ఏపీ హైకోర్టు ముందుకు రాబోతోంది. విభజన తర్వాత ఏపీ హైకోర్టు ఈ కేసును తొలిసారిగా  విచారించనుంది. విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన దాడి కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేయాలని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దర్యాప్తు ఆలస్యం అయితే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉంటుందని గత విచారణలో కోర్టు దృష్టికి ఆర్కే తరపున న్యాయవాది తీసుకొచ్చారు. గతంలో పిటిషనర్‌ […]

Advertisement
Update: 2019-01-03 21:52 GMT

జగన్‌పై హత్యాయత్నానికి సంబంధించిన కేసు నేడు ఏపీ హైకోర్టు ముందుకు రాబోతోంది. విభజన తర్వాత ఏపీ హైకోర్టు ఈ కేసును తొలిసారిగా విచారించనుంది.

విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన దాడి కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేయాలని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

దర్యాప్తు ఆలస్యం అయితే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉంటుందని గత విచారణలో కోర్టు దృష్టికి ఆర్కే తరపున న్యాయవాది తీసుకొచ్చారు.

గతంలో పిటిషనర్‌ వాదనతో ఏకీభవించిన హైకోర్టు… దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించడంపై అభిప్రాయాన్ని తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. లేని పక్షంలో తామే ఒక నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు గత విచారణ సందర్భంగా స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో కేసును ఎన్‌ఐఏకు బదిలీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంది. జగన్‌పై హత్యాయత్నం కేసును ఏపీ వేదికగా ఉన్న హైకోర్టు తొలిసారి విచారిస్తుండడంతో ఉత్కంఠ నెలకొంది.

Tags:    
Advertisement

Similar News