పూర్తి కాని హైకోర్టు భవనం.... ప్రభుత్వం కొత్త ప్రతిపాదన

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును విభజిస్తూ కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. జనవరి ఒకటి నుంచి ఏపీ, తెలంగాణ హైకోర్టులు వేర్వేరుగా పనిచేయనున్నాయి. అయితే ఇప్పుడు ఏపీ హైకోర్టుకు భవనం లేదు. అమరావతి వేదికగా జనవరి నుంచి ఏపీ హైకోర్టు కార్యకలాపాలను ప్రారంభించాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఏపీలో హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణం పూర్తి కాలేదు. ఇంకా నిర్మాణం సగంలోనే ఉంది. జవనరి 1కి మరో నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో కొత్త భవనంలో హైకోర్టు ఏర్పాటు […]

Advertisement
Update: 2018-12-26 23:29 GMT

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును విభజిస్తూ కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. జనవరి ఒకటి నుంచి ఏపీ, తెలంగాణ హైకోర్టులు వేర్వేరుగా పనిచేయనున్నాయి. అయితే ఇప్పుడు ఏపీ హైకోర్టుకు భవనం లేదు.

అమరావతి వేదికగా జనవరి నుంచి ఏపీ హైకోర్టు కార్యకలాపాలను ప్రారంభించాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఏపీలో హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణం పూర్తి కాలేదు. ఇంకా నిర్మాణం సగంలోనే ఉంది. జవనరి 1కి మరో నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో కొత్త భవనంలో హైకోర్టు ఏర్పాటు దాదాపు అసాధ్యమంటున్నారు.

సంక్రాంతి సెలవుల తర్వాత ఒకేసారి కార్యక్రమాలు మొదలుపెట్టాలన్న ఆలోచన ఉన్నా అప్పటికి కూడా హైకోర్టు తాత్కాలిక భవనం సిద్ధమవుతుందన్న గ్యారెంటీని ప్రభుత్వం ఇవ్వలేకపోతోంది. డిసెంబర్‌ 31కి హైకోర్టు భవన నిర్మాణం పూర్తవుతుందని చంద్రబాబు, మంత్రి నారాయణ ప్రకటించినా ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు.

ఈ నేపథ్యంలో న్యాయవర్గాల ముందు ఏపీ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన పెట్టింది. హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణం పూర్తయ్యే వరకు విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని హైకోర్టు కోసం వాడుతామని ఏపీ ప్రభుత్వం సూచించింది.

హైకోర్టు తాత్కాలిక భవనం పూర్తయ్యేందుకు మరింత సమయం పడుతుందని…. అందువల్లే అప్పటి వరకు సీఎం క్యాంపు కార్యాలయాన్ని హైకోర్టుకు వాడుకోవాల్సిందిగా ప్రభుత్వం ప్రతిపాదించింది.

Tags:    
Advertisement

Similar News