రేవంత్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ సీరియస్ !

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ ఎమ్మెల్యే అభ్యర్థి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఈనెల 4వ తేదీన రేవంత్ రెడ్డి కొండగల్ బంద్ కు పిలపునివ్వడంతోపాటు….టీఆరెస్ అధినేత కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటామన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించండంతోపాటు…. ఉద్దేశపూర్వకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో […]

Advertisement
Update: 2018-12-02 21:25 GMT

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ ఎమ్మెల్యే అభ్యర్థి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఈనెల 4వ తేదీన రేవంత్ రెడ్డి కొండగల్ బంద్ కు పిలపునివ్వడంతోపాటు….టీఆరెస్ అధినేత కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటామన్నారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించండంతోపాటు…. ఉద్దేశపూర్వకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఆధారాలను కూడా ఎన్నికల సంఘానికి సమర్పించారు.

టీఆర్ఎస్ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల కమిషన్ రేవంత్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. అంతేకాదు రేవంత్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

Tags:    
Advertisement

Similar News