ఆరుజట్ల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైట్

హాట్ ఫేవరెట్ గా 5వ ర్యాంక్ భారత్ ఐదు ఆసియాజట్లతో భారత్ అమీతుమీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ పురుషుల టైటిల్ సమరానికి… ఒమన్ లోని సుల్తాన్ ఖబూస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో రంగం సిద్ధమయ్యింది. అక్టోబర్ 18 నుంచి వారం రోజులపాటు జరిగే ఈ టోర్నీ లో డిఫెండింగ్ చాంపియన్ భారత్, మాజీ చాంపియన్ పాకిస్థాన్, దక్షిణ కొరియా, జపాన్, మలేసియా, ఆతిథ్య ఒమన్ జట్లు తలపడుతున్నాయి. గత నాలుగు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలలోనూ… […]

Advertisement
Update: 2018-10-18 04:18 GMT
  • హాట్ ఫేవరెట్ గా 5వ ర్యాంక్ భారత్
  • ఐదు ఆసియాజట్లతో భారత్ అమీతుమీ

ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ పురుషుల టైటిల్ సమరానికి… ఒమన్ లోని సుల్తాన్ ఖబూస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో రంగం సిద్ధమయ్యింది. అక్టోబర్ 18 నుంచి వారం రోజులపాటు జరిగే ఈ టోర్నీ లో డిఫెండింగ్ చాంపియన్ భారత్, మాజీ చాంపియన్ పాకిస్థాన్, దక్షిణ కొరియా, జపాన్, మలేసియా, ఆతిథ్య ఒమన్ జట్లు తలపడుతున్నాయి. గత నాలుగు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలలోనూ… భారత్, పాక్ జట్లు చెరో రెండుసార్లు విజేతలుగా నిలిచాయి.

ప్రపంచ ఐదో ర్యాంకర్ భారత్ 2011, 2016 టోర్నీలలో విజేతగా నిలిస్తే… 2012, 2013 టోర్నీల్లో పాకిస్థాన్ చాంపియన్ గా సత్తా చాటుకొంది.ప్రస్తుత 2018 ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమ్యాచ్ లో… ఒమాన్ తో భారత్ పోటీపడుతుంది. ఈమ్యాచ్ గురువారం నిర్వహిస్తారు.

అక్టోబర్ 20న జరిగే కీలక రెండోరౌండ్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో భారత్ ఢీ కొంటుంది.
అక్టోబర్ 21న జరిగే మూడోరౌండ్ మ్యాచ్ లో జపాన్ తో భారత్ తలపడుతుంది.
అక్టోబర్ 23న జరిగే మ్యాచ్ లో ఆసియాక్రీడల గోల్డ్ మెడలిస్ట్ మలేసియాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.
అక్టోబర్ 24న జరిగే ఆఖరి రౌండ్ పోటీలో దక్షిణ కొరియాతో భారత్ పోటీ పడుతుంది.
మొత్తం ఆరుజట్ల ఈ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ టోర్నీ మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్లో తలపడతాయి.

Tags:    
Advertisement

Similar News