ఫలించిన సాదినేని యామిని శ్రమ

టీడీపీ అధికార ప్రతినిధిగా సాదినేని యామిని నియమితులయ్యారు. ఈ మేరకు చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె స్వస్థలం గుంటూరు జిల్లా. 2014 ఎన్నికల సమయంలో పారిశ్రామికవేత్తలతో కలిసి చంద్రబాబు నాయకత్వంలోనే ఏపీ బాగుపడుతుందని ప్రచారం చేసిన టీంలో ఈమె కీలక పాత్రపోషించారు. అందుకు ప్రతిఫలంగా చంద్రబాబు అధికారంలోకి రాగానే రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ అడ్వయిజరీ కమిటీ సభ్యురాలిగా నియమించారు. దాంతో మరింత చురుగ్గా టీడీపీ తరపున వాయిస్ వినిపిస్తున్నారు. చంద్రబాబును ఎవరైనా […]

Advertisement
Update: 2018-10-06 21:49 GMT

టీడీపీ అధికార ప్రతినిధిగా సాదినేని యామిని నియమితులయ్యారు. ఈ మేరకు చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె స్వస్థలం గుంటూరు జిల్లా.

2014 ఎన్నికల సమయంలో పారిశ్రామికవేత్తలతో కలిసి చంద్రబాబు నాయకత్వంలోనే ఏపీ బాగుపడుతుందని ప్రచారం చేసిన టీంలో ఈమె కీలక పాత్రపోషించారు. అందుకు ప్రతిఫలంగా చంద్రబాబు అధికారంలోకి రాగానే రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ అడ్వయిజరీ కమిటీ సభ్యురాలిగా నియమించారు. దాంతో మరింత చురుగ్గా టీడీపీ తరపున వాయిస్ వినిపిస్తున్నారు.

చంద్రబాబును ఎవరైనా విమర్శిస్తే వారికి వెంటనే సోషల్ మీడియా ద్వారా కౌంటర్ ఇస్తుంటారు సాదినేని యామిని. సోషల్ మీడియాలో చరుగ్గా ఉంటూ చంద్రబాబుపై ఈగ వాలనివ్వకుండా ఎదురుదాడి చేస్తుంటారు. ఆమె సేవలు పార్టీకి అవసరమని భావించిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధిగా నియమించారు.

Tags:    
Advertisement

Similar News