సంచలనం... రూ. 5కోట్లు డిమాండ్ చేస్తూ స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిన టీడీపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తీవ్రతకు అద్దం పట్టేలా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో రైల్వే పనులు జరగకుండా లంచాల కోసం కోడెల శివప్రసాద్‌ కుమారుడు శివరామ్‌ కాంట్రాక్టర్ లను బెదిరిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు మరవకముందే మరో టీడీపీ ఎమ్మెల్యే అవినీతి విశ్వరూపం కెమెరాలకు దొరికింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కరుగొండ్ల రామకృష్ణ ఒక రైల్వే కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను డబ్బుల కోసం బెదిరిస్తూ కెమెరాలకు దొరికిపోయాడు. కాంట్రాక్టులో 5 శాతం […]

Advertisement
Update: 2016-09-26 10:59 GMT

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తీవ్రతకు అద్దం పట్టేలా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో రైల్వే పనులు జరగకుండా లంచాల కోసం కోడెల శివప్రసాద్‌ కుమారుడు శివరామ్‌ కాంట్రాక్టర్ లను బెదిరిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు మరవకముందే మరో టీడీపీ ఎమ్మెల్యే అవినీతి విశ్వరూపం కెమెరాలకు దొరికింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కరుగొండ్ల రామకృష్ణ ఒక రైల్వే కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను డబ్బుల కోసం బెదిరిస్తూ కెమెరాలకు దొరికిపోయాడు. కాంట్రాక్టులో 5 శాతం లేదంటే ఐదు కోట్లు ఇవ్వాలని లేకుంటే పనులు జరగనివ్వమని ఎమ్మెల్యే బెదిరించారు. ఇదంతా కొందరు రికార్డు చేశారు. అనంతరం కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు మీడియా ముందుకు వచ్చి టీడీపీ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు.

రాపూరు- కృష్ణపట్నం రైల్వే పనులు జరగాలంటే తనకు రూ. 5కోట్లు లంచం ఇవ్వాలని ఎమ్మెల్యే బెదిరించారని మాంటో కార్గో కంపెనీ సెక్రటరీ కల్పేశ్ దేశాయ్ మీడియాతో చెప్పారు. చంద్రబాబు పాలనలో అవినీతి ఉండదని తామొస్తే ఇక్కడ మాత్రం పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు వాపోయారు. పనులు చేస్తుంటే వచ్చి తమ సిబ్బందిపై ఎమ్మెల్యే అనుచరులు దాడులు కూడా చేశారని ఆరోపించారు. తాము ఇలాంటి చోట పనులు చేయలేమని కావాలంటే కాంట్రాక్ట్ వదిలేసి వెళ్తామని .. ఇలా లంచాలు ఇచ్చే ప్రసక్తే లేదని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏమీ చేయలేకపోయారని ఇలాంటి పరిస్థితులు ఎక్కడా చూడలేదని మాంటో కార్గో కంపెనీ ప్రతినిధులు వాపోయారు.

మొత్తం మీద ఇప్పటికే అత్యంత వివాదాస్పద వ్యక్తిగా పేరున్న వెంకటగిరి ఎమ్మెల్యే కరుగొండ్ల రామకృష్ణ ఇలా నేరుగా డబ్బుల కోసం బెదిరిస్తూ దొరకడం సంచలనమే. రామకృష్ణపై తొలి నుంచి చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఈయనకు తిరుగులేదన్న ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఏ చిన్న పని చేయాలన్నా కాంట్రాక్టర్లు తొలుత రామకృష్ణకు డబ్బులు చెల్లించుకోవాలి. తనను ప్రశ్నిస్తే రామకృష్ణకు విపరీతమైన కోపం వస్తుంది. గతంలో కలెక్టర్ మీద దౌర్జన్యం చేసిన చరిత్ర కూడా ఈయనకు ఉంది. గతంలో ఒక టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలోనూ పూలకుండి పగులగొట్టి తన ప్రవర్తన ఎలా ఉంటుందో చూపించారు. ఇవన్నీ చంద్రబాబుకు తెలిసినా ఆయన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇప్పుడు ఏకంగా రైల్వే పనులకు అడ్డుపడుతూ ఏకంగా రూ. 5కోట్లు డిమాండ్ చేసే స్థాయికి చేరారని చెబుతున్నారు.

Click on Image to Read:
Tags:    
Advertisement

Similar News