బెజవాడ కేంద్రంగా ఉత్తరాంధ్రకు ఉరి?

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాలను వదిలేసి కేవలం కృష్ణా, గుంటూరు మధ్య అన్ని సంస్థలు ఏర్పాటు చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు ఉత్తరాంధ్రకు ఉరివేసేందుకు సిద్ధమైనట్టుగా ఉంది. చంద్రబాబు అనుకూల లీక్‌ పత్రిక ప్రచురించిన కథనం చూస్తుంటే మరీ ఇంత అన్యాయమా అనిపించకమానదు. దశాబ్దాలుగా ప్రత్యేక రైల్వే జోన్‌కోసం ఉత్తరాంధ్రవాసులు పోరాడుతుంటే… ఇప్పుడు రైల్వే జోన్ కూడా విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నట్టు బాబు పత్రిక భారీ కథనాన్ని రాసింది. ప్రత్యేక హోదా లేదని ప్రత్యేక ప్యాకేజ్‌పై బుధవారం […]

Advertisement
Update: 2016-09-06 21:38 GMT

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాలను వదిలేసి కేవలం కృష్ణా, గుంటూరు మధ్య అన్ని సంస్థలు ఏర్పాటు చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు ఉత్తరాంధ్రకు ఉరివేసేందుకు సిద్ధమైనట్టుగా ఉంది. చంద్రబాబు అనుకూల లీక్‌ పత్రిక ప్రచురించిన కథనం చూస్తుంటే మరీ ఇంత అన్యాయమా అనిపించకమానదు. దశాబ్దాలుగా ప్రత్యేక రైల్వే జోన్‌కోసం ఉత్తరాంధ్రవాసులు పోరాడుతుంటే… ఇప్పుడు రైల్వే జోన్ కూడా విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నట్టు బాబు పత్రిక భారీ కథనాన్ని రాసింది. ప్రత్యేక హోదా లేదని ప్రత్యేక ప్యాకేజ్‌పై బుధవారం మధ్యాహ్నం 2.30కు ప్రకటన వెలువడుతుందని ముహూర్తంతో సహా కథనం రాసింది సదరు పత్రిక.

విశాఖ రైల్వే జోన్‌కు ఒడిసా, చత్తీస్‌గడ్ అంగీకరించవని కేంద్రం చెప్పిందట. కావాలంటే విజయవాడ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని టీడీపీ పత్రిక రాసుకొచ్చింది. ఇదే జరిగితే విశాఖ రైల్వే జోన్ కోసం పోరాడుతున్న ఉత్తరాంధ్రవాసులకు తీరని నష్టమే. విజయవాడలో రైల్వే జోన్ కేంద్రం ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్రవాసులకు ఉద్యోగావకాశాల్లో ఏమేరకు ఫలితం ఉంటుందన్నది ఎవరైనా ఊహించవచ్చు. విజయవాడ రైల్వే జోన్ అంశం తెరపైకి రావడమే టీడీపీ నేతల కుట్రగా భావిస్తున్నారు. మొత్తం అభివృద్దిని తనకు ఇష్టమైన విజయవాడ వద్దే కేంద్రీకరిస్తున్న చంద్రబాబు రైల్వే జోన్‌ కూడా అక్కడే ఏర్పాటు చేసి వేల ఉద్యోగాలు కావాల్సిన ప్రాంతానికి కట్టబెట్టే అన్యాయానికి దిగజారుతున్నారని భావిస్తున్నారు. పైగా గతేడాది రైల్వే బడ్జెట్ సమయంలో టీడీపీ ఎంపీల సమావేశం జరగ్గా… ఆరోజే టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఈ స్లోగన్ అందుకున్నారు. రైల్వే జోన్‌ను విశాఖ కేంద్రంగా కాకుండా గుంటూరు కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

అయితే ఉత్తరాంధ్ర నుంచి తీవ్రవ్యతిరేకత రావడంతో ఆ విషయంలో సైలెంట్ అయిపోయారు. అయితే ఇప్పుడు మరోసారి ఉత్తరాంధ్రకు రావాల్సిన జోన్‌ను హైజాక్ చేసేందుకు టీడీపీ వ్యూహరచన చేసినట్టుగానే ఉంది. అంతేకాదు మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలోనూ రైల్వే జోన్ విజయవాడ కేంద్రంగా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారని పత్రిక వెల్లడించింది. ఇప్పటికే రాయలసీమను నిర్లక్ష్యం చేసి చిచ్చు రాజేసిన చంద్రబాబు ఇప్పుడు ఉత్తరాంధ్ర, కోస్తా మధ్య కూడా చిచ్చు పెడుతున్నారా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా రైల్వే జోన్ విశాఖకు దక్కకపోతే అంతకు మించిన అన్యాయం మరొకటి ఉండదు. బహుశా విభజన సమయంలో చంద్రబాబు చెప్పిన సమన్యాయం అంటే ఇదే కాబోలు. చంద్రబాబు లీక్ పత్రిక చెప్పిన దాంట్లో నిజం ఎంతుందన్నది పక్కన పెడితే టీడీపీ నేతల్లో రైల్వే జోన్‌ను విజయవాడకు ఎగరేసుకుపోవాలన్న దురాలోచన ఉందన్నది మాత్రం పత్రిక కథనం బట్టి స్పష్టమవుతోంది.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News