సుజనా చౌదరి విమర్శించింది చంద్రబాబునా? జగన్‌నా?

ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై దర్యాప్తుకు ఏసీబీ కోర్టు విచారణకు ఆదేశించడంతో ఈసారి పావులు కదిపే బాధ్యత సుజనా చౌదరి తన భుజ స్కంధాలపై వేసుకున్నారు. టీడీపీకి గాడ్‌ఫాదర్‌లాంటి వెంకయ్యనాయుడు సాయంతో కథ నడిపించగలిగాడు. తనపై దర్యాప్తు నిలిపివేయాలని చంద్రబాబు హైకోర్టుని కోరిన నేపధ్యంలో సుజనాచౌదరి నిన్న మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును వెనకేసుకొస్తున్నట్లుగా, ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నట్లుగా నర్మగర్బంగా మాట్లాడుతూ ప్రజా తీర్పును గౌరవించాలని, రాజ్యాంగ విలువలను పాటించాలని, రాజకీయ విలువలను కాపాడాలని హితవు చెప్పాడు. ఆయన ఆ […]

Advertisement
Update: 2016-09-01 23:15 GMT

ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై దర్యాప్తుకు ఏసీబీ కోర్టు విచారణకు ఆదేశించడంతో ఈసారి పావులు కదిపే బాధ్యత సుజనా చౌదరి తన భుజ స్కంధాలపై వేసుకున్నారు. టీడీపీకి గాడ్‌ఫాదర్‌లాంటి వెంకయ్యనాయుడు సాయంతో కథ నడిపించగలిగాడు.

తనపై దర్యాప్తు నిలిపివేయాలని చంద్రబాబు హైకోర్టుని కోరిన నేపధ్యంలో సుజనాచౌదరి నిన్న మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును వెనకేసుకొస్తున్నట్లుగా, ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నట్లుగా నర్మగర్బంగా మాట్లాడుతూ ప్రజా తీర్పును గౌరవించాలని, రాజ్యాంగ విలువలను పాటించాలని, రాజకీయ విలువలను కాపాడాలని హితవు చెప్పాడు.

ఆయన ఆ నీతి బోధ ఎవరికి చేసినట్లు? ఈ సందర్భంగా ప్రజా తీర్పును ఉల్లంఘించింది ఎవరు? ఉల్లంఘిస్తున్నది ఎవరు?
వేరే పార్టీ ప్రజా ప్రతినిధులను డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తూ దొరికిపోయింది చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్‌ లో వైఎస్‌ఆర్‌సీపీ తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధులను కోట్టు కుమ్మరించి కొంటున్నది చంద్రబాబు. కాబట్టి సుజనా చౌదరి విమర్శ పరోక్షంగా చంద్రబాబుకే గట్టిగా తగిలింది.

మామూలుగా అయితే సుజనా చౌదరి విమర్శలు ప్రతిపక్షాల మీదే అనుకుంటారు ఎవరైనా. కానీ లోతుగా విషయాలు తెలిసిన వ్యక్తులకు, సుజనా చౌదరి అంతరంగం ఎరిగిన వ్యక్తులకు ఈ విమర్శలు చంద్రబాబును ఉద్దేశించి చేసినవే అని తెలిసిపోతుంది. ఎందుకంటే రెండునెలల క్రితం సుజనా చౌదరి రాజ్యసభ సభ్యత్వం ముగిసిన సందర్భంగా మరోసారి ఆయనను పార్టీ తరపున రాజ్యసభకు పంపడానికి చంద్రబాబు విముఖత చూపారు. ఆ మంత్రి పదవిని వేరొకరికి ఇవ్వడానికి ఆలోచన చేశారు. ఆ విషయం గ్రహించిన సుజనా చౌదరి బీజేపీని ఆశ్రయించారు. సుజనాచౌదరిని తెలుగుదేశం పార్టీ రాజ్యసభకు ఎంపిక చేయకపోయినా, ఆయనను మంత్రి వర్గంలో కొనసాగిస్తామని బీజేపీ నాయకులు చంద్రబాబుకు స్పష్టంచేశారు. దాంతో పరువు పోతుందనుకున్న చంద్రబాబు సుజనాచౌదరిని రాజ్యసభకు పంపారు. బహుశా ఆ కసితోనే సుజనా చౌదరి పరోక్షంగా చంద్రబాబుమీద ఇలాంటి విమర్శలు చేశాడా? అని సుజనా చౌదరి సన్నిహితులు అనుకుంటున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News