రేవంత్ గ‌డ్డం క‌థ ఇదేనా?

ఈ మ‌ధ్య రేవంత్ గ‌డ్డంతో క‌నిపిస్తున్నాడు. సాగునీటి ప్రాజెక్టుల‌పై హైద‌రాబాద్‌లో చేసిన ధ‌ర్నా.. అరెస్ట‌వ‌డం. జీఎస్టీ బిల్లులో అసెంబ్లీలో, క‌రీంన‌గ‌ర్‌లో జిల్లా కారాగారంలోనూ ఈ గ‌డ్డంతోనే క‌నిపించి హ‌ల్ చ‌ల్ చేశాడు. రేవంత్‌ గ‌డ్డం పెంచ‌డం, మాస్ లుక్‌లో క‌నిపించ‌డం వెన‌క ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు నడుస్తున్నాయి. ఎలాగూ ర‌మ‌ణ‌కు పొగ మొద‌లైంది. కాబ‌ట్టి, త్వ‌ర‌లోనే పార్టీని త‌న చేతిలోకి తెచ్చుకునే ప్ర‌య‌త్నాల్లో రేవంత్ ఉన్నాడ‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.  పైగా బాబు ఆశీస్సులు దండిగా ఉన్న వ్య‌క్తి క‌దా! […]

Advertisement
Update: 2016-09-01 00:06 GMT
ఈ మ‌ధ్య రేవంత్ గ‌డ్డంతో క‌నిపిస్తున్నాడు. సాగునీటి ప్రాజెక్టుల‌పై హైద‌రాబాద్‌లో చేసిన ధ‌ర్నా.. అరెస్ట‌వ‌డం. జీఎస్టీ బిల్లులో అసెంబ్లీలో, క‌రీంన‌గ‌ర్‌లో జిల్లా కారాగారంలోనూ ఈ గ‌డ్డంతోనే క‌నిపించి హ‌ల్ చ‌ల్ చేశాడు. రేవంత్‌ గ‌డ్డం పెంచ‌డం, మాస్ లుక్‌లో క‌నిపించ‌డం వెన‌క ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు నడుస్తున్నాయి. ఎలాగూ ర‌మ‌ణ‌కు పొగ మొద‌లైంది. కాబ‌ట్టి, త్వ‌ర‌లోనే పార్టీని త‌న చేతిలోకి తెచ్చుకునే ప్ర‌య‌త్నాల్లో రేవంత్ ఉన్నాడ‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. పైగా బాబు ఆశీస్సులు దండిగా ఉన్న వ్య‌క్తి క‌దా! ఇంత‌కీ.. రేవంత్ పార్టీ అధ్య‌క్షుడు కావ‌డానికి ఆయ‌న గ‌డ్డానికి ఏంటి లింకు అనుకుంటున్నారా?
కొంత‌కాలంగా సీనియ‌ర్లు ఈ దూకుడుపై అసంతృప్తిగా ఉన్నారు. జూనియ‌ర్ అయి ఉండి ఇలా వ్య‌వ‌హ‌రించ‌డ‌మేంట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి చూసేందుకు చాలా సౌమ్యంగా క‌నిపిస్తాడు. ప్ర‌తిరోజూ క్లీన్‌షేవ్‌, ఇస్ర్తీ బ‌ట్ట‌లు, టీష‌ర్టుల‌తో ఇంకా యువ‌కుడిగానే క‌నిపిస్తాడు. పార్టీలో రేవంత్‌ను అంతా ఇంకా యువ‌నాయ‌కుడిగానే ప‌రిగ‌ణిస్తున్నారు. సీనియ‌ర్ల నోళ్లు మూయించాలంటే.. తాను కూడా పెద్ద‌వాడిలా క‌నిపించాల‌న్న తాప‌త్ర‌యం రేవంత్‌లో మొద‌లైంద‌ని టీడీపీలో చ‌ర్చించుకుంటున్నారు. ఈ ప్ర‌య‌త్నంలో భాగంగానే గ‌డ్డం పెంచి, దూకుడు పెంచాడు. అవే ఫొటోలు ప‌త్రిక‌ల్లో వచ్చేలా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు అని అనుకుంటున్నారు. నిజంగా రేవంత్ గ‌డ్డం పెంచ‌డం ఇంత క‌థ ఉందా? అని చాలామంది కొట్టిపారేస్తున్నారు. ఇదేదో దేవుడి మొక్కు అయి ఉంటుంద‌ని స‌రిపెట్టుకుంటున్నారు. ఏదేమైనా రేవంత్ గ‌డ్డం పెంచ‌డం తెలంగాణ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు దారి తీసింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News