కీరా దోసని కేర్ లెస్ గా చూడకండి.. చాలా ప్రయోజనాలున్నాయ్

వేసవిలో కూల్ డ్రింక్ లు , కొబ్బరి బోండాలు, ఐస్‌ క్రీమలతో పాటూ గిరాకీ బాగా ఉండే మరొకటి కీరా దోస. నిజానికి ఇది అన్ని సీజన్లలోనూ దొరుకుతుంది. కానీ ఎక్కువమంది వేసవికాలంలోనే తింటూ ఉంటారు మండే ఎండల్లో శరీరానికి చలువనిచ్చేది కీరా దోసకాయ.

Advertisement
Update: 2024-05-09 11:08 GMT

వేసవిలో కూల్ డ్రింక్ లు , కొబ్బరి బోండాలు, ఐస్‌ క్రీమలతో పాటూ గిరాకీ బాగా ఉండే మరొకటి కీరా దోస. నిజానికి ఇది అన్ని సీజన్లలోనూ దొరుకుతుంది. కానీ ఎక్కువమంది వేసవికాలంలోనే తింటూ ఉంటారు మండే ఎండల్లో శరీరానికి చలువనిచ్చేది కీరా దోసకాయ. ఇందులో 90శాతం పైన నీటి కంటెంట్ ఉండటం వల్ల ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. జీర్ణవ్యవస్థను, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అందంగా కనిపించేలా చేస్తుంది.

దీన్ని కొంతమంది తొక్కతోపాటు తింటే మరికొందరు తొక్క తీసేసి తింటారు. ఎలా తిన్నా ఆరోగ్యమే. ఎందుకంటే ఈ తొక్కలో విటమిన్ కే, విటమిన్ సి, క్యాల్షియం, పొటాషియం, పీచు అధికంగా ఉంటాయి. విటమిన్ కే కూడా లభిస్తుంది. కొంతమేరకు ప్రోటీన్ కూడా ఉంటుంది.



హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం, దోసకాయలు చాలా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఈ రాడికల్స్ క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తులు , ఆటో ఇమ్యూన్ వ్యాధులతో సహా అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయి.

దోసకాయను తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. బరువును తగ్గించుకోవాలనుకునే వారికి కీరాదోస చాలా మంచి ఎంపిక. క్యాలరీలు, పిండి పదార్థాలు కూడా తక్కువే.డయాబెటిస్ ఉన్నవారికి కూడా దోసకాయ ఎంతో మేలు చేస్తుంది. దీనిలో చక్కర చాలా తక్కువ అలాగే దీని గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తక్కువ. అంటే ఇది తిన్నాక రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తక్కువ పరిణామంలో పెరుగుతాయి.

కాబట్టి మధుమేహం ముదరకూడదు అనుకుంటే దోసకాయను తినడం అలవాటు చేసుకోవచ్చు. దోసకాయ తీసుకోవడం వల్ల మీ ప్రేగు కదలికలు మెరుగుపడతాయి . మలబద్ధకాన్ని నివారిస్తుంది. దోసకాయలో నీరు . ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . దోసకాయల్లో ఉండే ఒక ప్రత్యేకమైన రసాయనం క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది. కాబట్టి రోజుకి ఒక దోసకాయ తినే వారిలో కాలేయం, ఊపిరితిత్తులు, రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్లు వచ్చే అవకాశం చాలా తక్కువ అని ఒక అధ్యయనం చెబుతోంది.

వీటన్నింటితో పాటూ దోసకాయ మీ సౌందర్యాన్ని పెంచుతుంది. కళ్లు అలసిపోవడం, కళ్ల కింద నల్లని వలయాలు, కళ్ళు ఉబ్బినట్టుగా ఉంటే కీరాదోస ముక్కల్ని కళ్లపై కాసేపు పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది కళ్ల చుట్టూ ఉన్న చర్మాన్ని తేమగా ఉంచుతుంది.


 



Tags:    
Advertisement

Similar News