"కాళ్లు పట్టుకుంటాం" అని వేడుకున్న బోండా

 తమది తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడేందుకు పుట్టిన పార్టీ అని… ఆత్మగౌరవానికి తామే బ్రాండ్ అంబాసిడర్లమని టీడీపీ నేతలు కోతలు కోస్తుంటారు. కానీ వారి ఆత్మగౌరవం ఏ స్థాయికి దిగజారిందో అద్దంపట్టే ఘటన ఇది. ప్రతిపక్షాలపైకి పౌరుషానికి ప్రతినిధి అన్నట్టు ఎదురుదాడి చేసే టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా… ప్రత్యేక హోదా కోసం కాళ్లు పట్టుకునేందుకు కూడా సిద్దమని ప్రకటించారు. తెలుగువారి ఆత్మగౌరవ పార్టీ నేత పోరాటం చేయాల్సింది పోయి బెజవాడలో బీజేపీ కార్యాలయం ముందు పాచిపని […]

Advertisement
Update: 2016-08-05 02:32 GMT

తమది తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడేందుకు పుట్టిన పార్టీ అని… ఆత్మగౌరవానికి తామే బ్రాండ్ అంబాసిడర్లమని టీడీపీ నేతలు కోతలు కోస్తుంటారు. కానీ వారి ఆత్మగౌరవం ఏ స్థాయికి దిగజారిందో అద్దంపట్టే ఘటన ఇది. ప్రతిపక్షాలపైకి పౌరుషానికి ప్రతినిధి అన్నట్టు ఎదురుదాడి చేసే టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా… ప్రత్యేక హోదా కోసం కాళ్లు పట్టుకునేందుకు కూడా సిద్దమని ప్రకటించారు. తెలుగువారి ఆత్మగౌరవ పార్టీ నేత పోరాటం చేయాల్సింది పోయి బెజవాడలో బీజేపీ కార్యాలయం ముందు పాచిపని చేశారు.

బీజేపీ బోర్డును శుభ్రం చేశారు. ఆఫీస్ ముందు ఉన్న కార్లు, స్కూటర్లను శుభ్రం చేశారు. చీపుర్లు పట్టుకుని కార్యాలయం ఆవరణను ఊడ్చారు. ఇదేమిటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… చంద్రబాబు పిలుపు మేరకు జపాన్‌ తరహాలోనే నిరసన తెలుపుతున్నామని బోండా సెలవిచ్చారు. ఇలా శుభ్రం చేయడమే కాదు కేంద్ర మంత్రుల కాళ్లు పట్టుకునేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని దయచేసి ప్రత్యేకహోదా ఇవ్వాలని వేడుకున్నారు బోండా. ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా చూస్తామని బీజేపీ మంత్రి మాణిక్యాల రావు చెప్పడాన్ని ప్రస్తావిస్తూ .. రెండేళ్ల కాలంలో ప్రత్యేక రాష్ట్రంగా ఏపీకి ఏమిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ రోజు కూడా చంద్రబాబు కలిసినప్పుడు ప్రధాని సానుకూలంగా స్పందించారని చెబుతున్నారని కానీ.. చంద్రబాబు గతంలో 30 సార్లు ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా ఇదే తరహాలో హామీ ఇచ్చారని బోండా అన్నారు. ఇప్పటికైనా కేంద్రం ఏపీకి ఆదుకోవాల్సిందిగా చేతులు జోడించి వేడుకుంటున్నామని ఉమ చెప్పారు. అవసరమైతే బీజేపీ నేతలు కాళ్లు పట్టుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాళ్లు పట్టుకుని హోదా సాధించుకునే స్థాయికి తెలుగు జాతిని దిగజార్చారన్న మాట. అయినా అలా కాళ్లు పట్టుకుని హోదా సాధించడం కంటే పక్కనే ఉన్న బంగాళాఖాతంలో దూకి ఆత్మహత్య చేసుకోవడమే మంచిదని పలువురు విమర్శిస్తున్నారు.

Click on Image to Read:

Also Read క‌బాలిని కూడా వ‌ద‌ల్లేదు..!

17 ఏళ్ల త‌ర్వాత గౌత‌మిని చూడ‌బోతున్నాం…!

విడాకులు తీసుకోవడం గ్యారెంటీ…

Tags:    
Advertisement

Similar News