బాబు దోస్తు!. బంధీలుగా ఇద్దరు అమ్మాయిలు

చంద్రబాబుకే ఇలాంటి వారు తగులుతారో.. లేకుంటే అలాంటి వారితోనే చంద్రబాబు స్నేహం చేస్తారో గానీ.. తాజాగా యోగగురువు జగ్గీవాసుదేవన్ అసలు రూపం వెలుగులోకి వచ్చింది. జగ్గీ చేసిన చీకటి కోణంపై జాతీయ మీడియాలో రచ్చ జరుగుతోంది. మత్తు పదార్థాలు ఇచ్చి జగ్గీ వాసుదేవ్ చేస్తున్న అకృత్యాలపై కడుపు మండిన ఒక తండ్రి న్యాయంకోసం పోరాడుతున్నారు. ఆ మధ్య అజయ్ దేవ్‌గన్‌ను ఏపీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ను చేస్తానంటూ చంద్రబాబు తీసుకొచ్చారు. ఇంతలోనే ఆయన పనామా జాబితాలో దొరికిపోయారు. దీంతో పరువు […]

Advertisement
Update: 2016-08-03 08:30 GMT

చంద్రబాబుకే ఇలాంటి వారు తగులుతారో.. లేకుంటే అలాంటి వారితోనే చంద్రబాబు స్నేహం చేస్తారో గానీ.. తాజాగా యోగగురువు జగ్గీవాసుదేవన్ అసలు రూపం వెలుగులోకి వచ్చింది. జగ్గీ చేసిన చీకటి కోణంపై జాతీయ మీడియాలో రచ్చ జరుగుతోంది. మత్తు పదార్థాలు ఇచ్చి జగ్గీ వాసుదేవ్ చేస్తున్న అకృత్యాలపై కడుపు మండిన ఒక తండ్రి న్యాయంకోసం పోరాడుతున్నారు.

ఆ మధ్య అజయ్ దేవ్‌గన్‌ను ఏపీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ను చేస్తానంటూ చంద్రబాబు తీసుకొచ్చారు. ఇంతలోనే ఆయన పనామా జాబితాలో దొరికిపోయారు. దీంతో పరువు గంగలో కలిసింది. ఇప్పుడు చంద్రబాబుకు మూడు రోజుల యోగా క్లాసులు చెప్పి మూడు కోట్లు ఫీజు తీసుకుని కాలేజ్ పేరుతో అమరావతిలో 400 ఎకరాలు దొబ్బేయడానికి సిద్దపడ్డ జగ్గీవాసుదేవన్‌ చీకటి సంగతులు బయటపడ్డాయి. ఇషా ఫౌండేషన్ నడుపుతున్న జగ్గీ బాబు… ఇద్దరు అమ్మాయిలను తన ఆశ్రమంలో బంధించారన్నది ఇప్పుడు ఆరోపణ. ఈ ఆరోపణలు చేసింది ఎవరో కాదు ఇద్దరు యువతుల తండ్రి అయిన ఒక రిటైర్డ్ లెక్చరర్. కోయంబత్తూరులో వ్యవసాయ శాఖ వర్శిటీలో రిటైర్ అయిన కామరాజ్‌ ఇద్దరు కూమార్తెలు గీత, లతను జగ్గీ బంధించారు. వీరిలో ఒకరు ఎంటెక్, మరొకరు బీటెక్‌ పూర్తి చేశారు. పెద్ద కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తున్నారు. అయితే భక్తిపాఠాల పేరుతో తన కూతుర్లను మాయలోకి లాగిన జగ్గీ వాసుదేవ్‌… వారిని బానిసలుగా మార్చుకున్నారని కామరాజ్ ఆవేదన చెందుతున్నారు. వారిద్దరికి మత్తు మందు ఇచ్చి అమావాస్య, పౌర్జమి రోజుల్లో చిత్రహింసలు పెడుతున్నారని రోధించారు. ఇషా సంస్థలో చదువుతున్న పిల్లలకు కూడా నైట్రస్ ఆక్సైడ్ ఇస్తున్నారని… దాని వల్లే వారు తల్లిదండ్రులు కలిసేందుకు వచ్చిన సమయంలో మాత్రం నవ్వుతూ ఉంటున్నారని కామరాజ్ చెబుతున్నారు.

కనీసం తన కూతుర్లను కలిసేందుకు కూడా జగ్గీ వాసుదేవ్ అనుమతి ఇవ్వడం లేదని కలెక్టర్‌ను కలిసి కామరాజ్ ఫిర్యాదు చేశారు. వెంటనే జోక్యం చేసుకుని తన కూతుర్లను విడిపించాలని వేడుకున్నారు. ఇలాంటి యధవ పనులు చేసిన జగ్గీవాసుదేవ్‌ దగ్గరే ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు మైమరచి నర్తించారు. ఆ డ్యాన్స్ కార్యక్రమంలో మంత్రులు, ఐఏఎస్‌లు కూడా తన్మయత్వం పొందారు. బహుశా అప్పుడు కూడా అందరూ నవ్వుతూ ఆనందంలో మునిగితేలేందుకు జగ్గీబాబా నైట్రస్ ఆక్సైడ్ ప్రయోగించారు కాబోలు. అన్నట్టు బాబు గారు అమరావతిలో 400 ఎకరాలుఇవ్వడమే ఆలస్యం అక్కడ కూడా ఇలాంటి కాలేజ్‌ను ప్రారంభిస్తారట జగ్గీ. అంటే అమరావతిలోనూ నైట్రస్ ఆక్సైడ్ వెదజల్లుతాడేమో జగ్గీ. ఏంటో పాపం చంద్రబాబుకు అందరూ ఇలాంటి వారే తగులుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News