ఆస్తులకేసు నిలబడదు... జగన్ ఆరోజే ఫోన్ చేశారు...

మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని తాను కూడా కోరుకున్నానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. జగన్ వైఎస్ కుమారుడైనప్పటికీ రాష్ట్ర విభజన నేపథ్యంలో అనుభవస్తుడైన చంద్రబాబే సీఎం కావాలని తాను కోరుకున్నానన్నారు. జనం కూడా అలాగే ఆలోచించారని అందుకే చంద్రబాబు ఒకశాతం ఓట్ల తేడాతో గెలిచారన్నారు. కానీ రెండేళ్లలో చంద్రబాబు పూర్తిగా విఫలమైపోయారన్నారు. తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చంద్రబాబు చేయడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో అదంతా జగన్‌కే ప్లస్ అవుతుందన్నారు. రాష్ట్రంలో […]

Advertisement
Update: 2016-07-26 06:27 GMT

మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని తాను కూడా కోరుకున్నానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. జగన్ వైఎస్ కుమారుడైనప్పటికీ రాష్ట్ర విభజన నేపథ్యంలో అనుభవస్తుడైన చంద్రబాబే సీఎం కావాలని తాను కోరుకున్నానన్నారు. జనం కూడా అలాగే ఆలోచించారని అందుకే చంద్రబాబు ఒకశాతం ఓట్ల తేడాతో గెలిచారన్నారు. కానీ రెండేళ్లలో చంద్రబాబు పూర్తిగా విఫలమైపోయారన్నారు. తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చంద్రబాబు చేయడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో అదంతా జగన్‌కే ప్లస్ అవుతుందన్నారు. రాష్ట్రంలో మూడో పార్టీకి అవకాశం కూడా లేదన్నారు. జనసేన కూడా నిలబడదన్నారు. ముద్రగడ దీక్ష సమయంలోనైనా పవన్ ఒక ట్వీట్ వదిలి ఉంటే కొంచమైనా మంచి జరిగేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలోకి రావడం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతోందన్నారు. అసలు చంద్రబాబు ఇలా పరిపాలిస్తాడని తాను ఊహించలేదన్నారు.

ఉండవల్లి వైసీపీలో చేరుతారంటూ వస్తున్న వార్తలను ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించగా… ఖండించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వైసీపీలో చేరాలనుకుంటే తనకు ఎంతసేపు అని ప్రశ్నించారు. వైసీపీ రాజశేఖర్ రెడ్డి కుమారుడి పార్టీనే కదా చేరాలనుకుంటే ఎంతసేపు పని అన్నారు. కానీ రాజకీయాలపై ఆసక్తి లేదన్నారు. తన తల్లి చనిపోయినప్పుడే జగన్ ఫోన్ చేసి పరామర్శించారని చెప్పారు. కానీ అప్పుడు అసెంబ్లీ సమావేశాల కారణంగా తన ఇంటికి రాలేదని… మొన్న రాజమండ్రి వచ్చినప్పుడు కలిశారని చెప్పారు. రాజకీయాల్లో ఒకటి కాకపోయినా ఫ్యామిలీ రిలేషన్స్‌ అలాగే ఉన్నాయన్నారు.

తాను ఎప్పుడు కూడా యాంటీ జగన్ కాదు. వైఎస్ ది యాక్సిడెంట్ కాదు అని కొందరు వైసీపీ నేతలు అనడాన్ని ఖండించడంతోనే తనను శత్రువుగా చూశారని చెప్పారు. జగన్‌ను జైలుకు పంపడమే కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు అన్నారు. వైఎస్‌ కుమారుడిని జైలుకు పంపడాన్ని తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోయారన్నారు. జగన్‌ను జైలుకు పంపడంతోనే కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు. జగన్ కేసు మొత్తం స్టడీ చేశానని అది నిలబడే చాన్సే లేదన్నారు. జగన్‌ను జైలుకు పంపడం పూర్తిగా రాజకీయ నిర్ణయమేనని ఉండవల్లి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News