కడప ప్లగ్‌లో వేలుపెట్టిన లోకేష్, 8మంది కొనుగోలు

ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకు పరిమితం చేసిన ఆపరేషన్ ఆకర్ష్‌ను చంద్రబాబు ఇప్పుడు కిందస్థాయికి చేర్చారు. కార్పొరేటర్లను కూడా వదలిపెట్టడం లేదు. సీఎం అయి ఉండి నేరుగా కార్పొరేటర్లకు కూడా ఆయనే కండువాలుకప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. యువకుడిగా కొత్తతరం రాజకీయాలకు శ్రీకారం చుట్టాల్సిన లోకేష్‌ కూడా తండ్రిజాడలోనే నడుస్తున్నారు. ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను దగ్గరుండి మరీ లాక్కుని ”యంగ్ బాయ్ -ఓల్డ్ యాటిట్యూడ్‌”గా పేరు తెచ్చుకుంటున్నారు. కడపలో నేరుగా గెలవడం సాధ్యంకాదన్న నిర్థారణకు వచ్చారు కాబోలు… అక్కడ కూడా […]

Advertisement
Update: 2016-07-18 22:59 GMT

ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకు పరిమితం చేసిన ఆపరేషన్ ఆకర్ష్‌ను చంద్రబాబు ఇప్పుడు కిందస్థాయికి చేర్చారు. కార్పొరేటర్లను కూడా వదలిపెట్టడం లేదు. సీఎం అయి ఉండి నేరుగా కార్పొరేటర్లకు కూడా ఆయనే కండువాలుకప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. యువకుడిగా కొత్తతరం రాజకీయాలకు శ్రీకారం చుట్టాల్సిన లోకేష్‌ కూడా తండ్రిజాడలోనే నడుస్తున్నారు. ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను దగ్గరుండి మరీ లాక్కుని ”యంగ్ బాయ్ -ఓల్డ్ యాటిట్యూడ్‌”గా పేరు తెచ్చుకుంటున్నారు.

కడపలో నేరుగా గెలవడం సాధ్యంకాదన్న నిర్థారణకు వచ్చారు కాబోలు… అక్కడ కూడా అడ్డదారి రాజకీయాలను లోకేష్ నమ్ముకున్నారు. వైసీపీకి చెందిన ఎనిమిది మంది కడప కార్పొరేటర్లను పార్టీలోకి చేర్చుకున్నారు. సోమవారం చంద్రబాబు వీరికి స్వయంగా కండువాలు కప్పారు. వీరికి కావాల్సినవన్నీ చేసిపెడుతానని లోకేష్ హామీ ఇవ్వడంతో వీరు పార్టీ మారారు. అడ్డదారిలోనైనా సరే కడప కార్పొరేషన్ ను కైవసం చేసుకోవాలని లోకేష్ భావిస్తున్నారట. 50 మంది కార్పొరేటర్లు ఉన్న కడపలో మొన్నటి ఎన్నికలప్పుడు టీడీపీ నుంచి 8 మందిమాత్రమే గెలిచారు. అయితే గతంలోనే నలుగురు వైసీపీ కార్పొరేటర్లను కొనుగోలు చేసిన టీడీపీ…తాజాగా సోమవారం మరో 8 మందిని సైకిల్ ఎక్కించుకుంది. ఇప్పుడు టీడీపీ బలం 20కి చేరింది. మరో ఐదారుగురిని అధిక ధరకు కొనైనా సరే కార్పొరేషన్ ను కైవసం చేసుకోవాలని లోకేష్ భావిస్తున్నారు.

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టుగా చంద్రబాబు నాయకత్వ లక్షణాలను బాగా గమనించిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి సవ్యంగా కార్పొరేటర్లతో బేరసారాలు నడిపారని చెబుతున్నారు. అయితే లోకేష్ ప్రస్తుతానికి తండ్రిని అడ్డుపెట్టుకుని కడపలోనూ కొనుగోలు రాజకీయాలు సాగించినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే అప్పుడు అమ్ముడుపోయిన కార్పొరేటర్లకు, మధ్యలో బ్రోకరిజం చేసిన నేతల సంగతి ఏమవుతుందోనని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు సంగతి అందరికీ తెలిసినదే అయినా… కొత్తతరం నేతగా చెప్పుకునే లోకేష్ కూడా కొనుగోలు రాజకీయాలనే నమ్ముకోవడం ద్వారా ఆయనకు స్వశక్తిపై ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోందంటున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News