చంద్రబాబు పరువును గంగలో కలిపిన కేటీఆర్‌

దేశంలో సెల్‌ ఫోన్ నుంచి ఇంటర్‌నెట్‌ వరకు అన్నీ తన హయాంలోనే వచ్చాయని ప్రతి మీటింగ్‌లోనూ చంద్రబాబు స్వయంగా చెబుతుంటారు. దేశంలో సాంకేతిక విప్లవానికి పితామహుడిని తానేనన్నట్టు స్పీచ్‌ ఇస్తుంటారు. తన సొంత తెలివితేటలతోనే పెట్టుబడులను ఆకర్షించి హైదరాబాద్‌ను తీసుకెళ్లి ప్రపంచపటంలో పెట్టానని ఇప్పటికీ చెబుతుంటారు. అయితే పెట్టుబడులను ఆకర్షించే విధానంపై వివాదం తలెత్తింది. ఏకంగా తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంపై కాపీరైట్‌ ఉల్లంఘన కింద కేసు నమోదు చేసింది. మ్యాటరేంటంటే… పెట్టుబడులకు దేశంలో ఏఏ రాష్ట్రం […]

Advertisement
Update: 2016-07-05 08:01 GMT

దేశంలో సెల్‌ ఫోన్ నుంచి ఇంటర్‌నెట్‌ వరకు అన్నీ తన హయాంలోనే వచ్చాయని ప్రతి మీటింగ్‌లోనూ చంద్రబాబు స్వయంగా చెబుతుంటారు. దేశంలో సాంకేతిక విప్లవానికి పితామహుడిని తానేనన్నట్టు స్పీచ్‌ ఇస్తుంటారు. తన సొంత తెలివితేటలతోనే పెట్టుబడులను ఆకర్షించి హైదరాబాద్‌ను తీసుకెళ్లి ప్రపంచపటంలో పెట్టానని ఇప్పటికీ చెబుతుంటారు. అయితే పెట్టుబడులను ఆకర్షించే విధానంపై వివాదం తలెత్తింది. ఏకంగా తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంపై కాపీరైట్‌ ఉల్లంఘన కింద కేసు నమోదు చేసింది. మ్యాటరేంటంటే…

పెట్టుబడులకు దేశంలో ఏఏ రాష్ట్రం ఎంతవరకు అనుకూలం అన్నదానిపై కేంద్రం ర్యాంకులిస్తోంది. ఇందుకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తాము పెట్టుబడులను ఆకర్షించేందుకు అవలంభిస్తున్న విధానాలను కేంద్రానికి వివరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సరళీకృతవిధానంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్ పేరులో ఒక అప్లికేషన్ తయారుచేసింది. ఇది తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో రూపుదిద్దుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-పాస్‌ విధానానికి ఇది అదనం. అయితే తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిన ఈజ్‌ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ కంటెంట్ ను ఉన్నదిఉన్నట్టుగా మక్కీకిమక్కి చంద్రబాబు ప్రభుత్వం కాపీ కొట్టేసింది. దాన్నే కేంద్ర ప్రభుత్వానికి పంపింది.

ఈ విషయం గమనించిన కేటీఆర్‌ … చంద్రబాబు పరువును ఢిల్లీ స్థాయిలో తీసేశారు. ఏకంగా కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌కు లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వం తమ అప్లికేషన్‌ను ఎలా కాపీ కొట్టిందని, పెట్టుబడుల ఆకర్షణలో అగ్రగామి రాష్ట్రం అనిపించుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోందంటూ లేఖలో వివరించారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలను కూడా లేఖతో పాటు నిర్మలాసీతారామన్‌కు పంపారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం వ్యూహత్మకమౌనాన్ని ఆశ్రయించింది. ఐటీకి పితామహుడిని, హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో వేలాడదీశానని చెప్పే చంద్రబాబు … కొత్త రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు సొంతంగా ప్లాన్‌ కూడా చేయలేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News