దైవభక్తా?.. బాబు భక్తా?

ఏపీ బీజేపీ మంత్రి మాణిక్యాలరావుకు నిజాయితీపరుడని పేరు ఉంది.  ఆర్‌ఎస్‌ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. హిందూమతమంటే సహజంగానే అభిమానం. ముక్కుసూటి మనిషి అని కూడా చెబుతుంటారు. ఈయన దేవాదాయశాఖకు 100శాతం సరిపోయే మంత్రి అనుకున్నారు అంతా. కానీ ఈ మధ్య ఆయన తీరు చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. అసలు మంత్రి పదవి ఆయనకు అలంకారమే తప్పితే దాని మీద ఆయనకు అసలు ఆసక్తి ఉందా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయశాఖలో పెద్దపెద్ద వ్యవహారాలను కూడా ఆయన […]

Advertisement
Update: 2016-06-30 23:25 GMT

ఏపీ బీజేపీ మంత్రి మాణిక్యాలరావుకు నిజాయితీపరుడని పేరు ఉంది. ఆర్‌ఎస్‌ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. హిందూమతమంటే సహజంగానే అభిమానం. ముక్కుసూటి మనిషి అని కూడా చెబుతుంటారు. ఈయన దేవాదాయశాఖకు 100శాతం సరిపోయే మంత్రి అనుకున్నారు అంతా. కానీ ఈ మధ్య ఆయన తీరు చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. అసలు మంత్రి పదవి ఆయనకు అలంకారమే తప్పితే దాని మీద ఆయనకు అసలు ఆసక్తి ఉందా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయశాఖలో పెద్దపెద్ద వ్యవహారాలను కూడా ఆయన పట్టించుకోవడం లేదు. సదాపర్తి భూముల నుంచి విజయవాడలో పాతికకుపైగా ఆలయాల కూల్చివేత వరకు మాణిక్యాల నుంచి మాటలు లేవు.

దేవాలయానికి చెందిన వెయ్యికోట్ల విలువైన భూములను గద్దలు తన్నుకుపోతున్నా పట్టించుకోలేనప్పుడు మాణిక్యాలరావు మంచి వారు ఎలా అవుతారన్న ప్రశ్న వస్తోంది. వ్యక్తిగతంగా నిజాయితీపరుడే అయి ఉండవచ్చు… కానీ దేవాలయాల భూములను రక్షించకుండా మౌనమే నా బాష ఓ మూగమనసా అంటూ కాలం వెళ్లదీసేందుకు సిద్ధపడినప్పుడు అది నిజాయితీ ఎలా అవుతుంది. అక్రమాలకు అడ్డుకట్టవేయాల్సిన స్థానంలో ఉండి కళ్లు మూసుకోవడం కూడా అవినీతే కదా!. ఇప్పుడు విజయవాడలోనూ టీడీపీ ఎంపీ కేశినేని నాని దగ్గరుండి మరీ పాతికకు పైగా ఆలయాలను, గోశాలలను నేలమట్టం చేయిస్తే దేవాదాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నారో అర్థం కావడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. చివరకు పీఠాధిపతులు ఆలయాల కూల్చివేతకు వ్యతిరేకంగా ఈనెల 4న రోడ్లమీదకు వచ్చేందుకూ సిద్ధమయ్యారు. కానీ దేవాదాయశాఖ మంత్రి మాత్రం ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. ఇది మాణిక్యాలరావుకే కాదు ఆయన మాతృసంస్థలకు అవమానమే.

హిందుత్వాన్ని ఇష్టపడే పార్టీ నాయకుడై ఉండి… ఆర్‌ఎస్‌ఎస్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉండికూడా మాణిక్యాల రావు ఎందుకు మౌనంగా ఉన్నారో!.. తనను తాను భీష్ముడితో పోల్చుకుని మౌనంగా ఉంటున్నారు కాబోలు!. హిందువుల సెంటిమెంట్ల విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు చాలా సార్లు వివాదాస్పదమైంది. అయ్యప్పదీక్షల వల్ల మద్యం విక్రమాలు తగ్గుతున్నాయని ఒకసారి సెలవిచ్చారు. పాపాత్ములే ఆలయాల హుండీల్లో డబ్బులు వేస్తున్నారని మరోసారి విశ్లేషించారు చంద్రబాబు. అయినా సరే ఒక్క బీజేపీ నేత గానీ, దాని అనుబంధ సంస్థల నాయకులు గానీ స్పందించిన దాఖలాలు లేవు. వీటిపై బీజేపీ మంత్రులు అడ్డుచెప్పకపోవడం, బీజేపీ నాయకులు కూడా తమకెందుకులే అని మౌనంగా ఉండడం బట్టి చివరకు బీజేపీ దైవ భక్తినే జనం శంకించే ప్రమాదం ఉంది. దైవభక్తి కంటే బాబు భక్తే ఎక్కువైనట్టుగా భావించే అవకాశం ఉంటుంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News