"రేయ్‌.. ఏంట్రా.. ఎక్కువ చేయవద్దు"- దేవినేని సోదరుడి వీరంగం

కృష్ణా జిల్లా టీడీపీ నేతల తీరు పదేపదే వివాదాస్పదం అవుతూనే ఉంది. తాజాగా మంత్రి దేవినేని ఉమా కజిన్ దౌర్జన్యానికి దిగారు. బ్యాంకు సిబ్బందిని ఇష్టమొచ్చినట్టు బూతులు తిట్టారు. రేయ్.. అంటూ రెచ్చిపోయారు. కృష్టా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో ఉమ రిసార్ట్స్ ఉంది. దీని యాజమన్యం 2006లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి మూడుకోట్ల రూపాయలు అప్పు తీసుకుంది. కానీ పైసా కూడా తిరిగి చెల్లించలేదు. వడ్డీతో కలిసి రుణంమొత్తం 9 కోట్లకు చేరింది. ఎన్నిసార్లు […]

Advertisement
Update: 2016-06-18 04:39 GMT

కృష్ణా జిల్లా టీడీపీ నేతల తీరు పదేపదే వివాదాస్పదం అవుతూనే ఉంది. తాజాగా మంత్రి దేవినేని ఉమా కజిన్ దౌర్జన్యానికి దిగారు. బ్యాంకు సిబ్బందిని ఇష్టమొచ్చినట్టు బూతులు తిట్టారు. రేయ్.. అంటూ రెచ్చిపోయారు. కృష్టా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో ఉమ రిసార్ట్స్ ఉంది. దీని యాజమన్యం 2006లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి మూడుకోట్ల రూపాయలు అప్పు తీసుకుంది. కానీ పైసా కూడా తిరిగి చెల్లించలేదు.

వడ్డీతో కలిసి రుణంమొత్తం 9 కోట్లకు చేరింది. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఉమా రిసార్ట్స్‌ లెక్కచేయలేదు. దీంతో బ్యాంకు సిబ్బంది రిసార్ట్స్ ను సీజ్ చేసేందుకు వచ్చారు. దీంతో విషయం తెలుసుకున్న మంత్రి దేవినేని ఉమా కజిన్ గద్దె భద్రయ్య అక్కడికి వచ్చి ఓరేంజ్‌లో విరుచుకుపడ్డారు. గద్దె భద్రయ్య కూడా ఒక బ్యాంకులో ఉద్యోగిగా చేస్తున్నారు. అయినా సరే దేవినేని ఉమ అండ చూసుకుని బ్యాంకు సిబ్బందిని బూతులు తిట్టారు.

”ఏంట్రా, రేయ్… ఎక్కువ చేయవద్దు. మీరు ఏం చేయగలర్రా. నోరు మూసుకోండి” అంటూ ఇష్టానుసారం తిట్టేశారు. ఆ సమయంలో కొందరు పోలీసులు అక్కడే ఉన్నా జేబుల్లో చేతులు పెట్టుకుని అటుఇటు తిరుగుతూ కనిపించారు. చివరకు పరిస్థితి చేయిదాటడడంతో పోలీసులే సర్ధిచెప్పారు. పోలీసుల సాయంతో ఉమ రిసార్ట్స్‌ను బ్యాంకు సిబ్బంది సీజ్ చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News