తండ్రిపై గౌరవంలేదా? మహానాడులో చినబాబు చిలిపి చేష్టలు

టీడీపీ మహానాడు తిరుపతిలో ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానానికి తీసుకెళ్లేందుకు తాను ప్రయత్నిస్తున్నానని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతురుణమాఫీ చేసింది తమ ప్రభుత్వమేనని చెప్పారు. డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి పదివేల చొప్పున రుణవిముక్తి చేసి వారిని సంఘటిత శక్తిగా మారుస్తామన్నారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇచ్చే పనిలో ఉన్నామన్నారు. ప్రత్యేక హోదాకోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నా కొందరు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అయితే చంద్రబాబు ఇంత సీరియస్‌గా మాట్లాడుతున్న […]

Advertisement
Update: 2016-05-27 02:30 GMT

టీడీపీ మహానాడు తిరుపతిలో ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానానికి తీసుకెళ్లేందుకు తాను ప్రయత్నిస్తున్నానని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతురుణమాఫీ చేసింది తమ ప్రభుత్వమేనని చెప్పారు. డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి పదివేల చొప్పున రుణవిముక్తి చేసి వారిని సంఘటిత శక్తిగా మారుస్తామన్నారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇచ్చే పనిలో ఉన్నామన్నారు. ప్రత్యేక హోదాకోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నా కొందరు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అయితే చంద్రబాబు ఇంత సీరియస్‌గా మాట్లాడుతున్న సమయంలో ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది.

రాష్ట్రంలో ఉన్న కష్టాలను, ఇబ్బందులను చాలా సీరియస్‌గా, ఆవేదనతో చంద్రబాబు వివరిస్తుంటే లోకేష్ మాత్రం లైట్ తీసుకున్నారు. చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో వేదికపైనే ఉన్న లోకేష్ పక్కనే కూర్చుకున్న నేతలతో చిట్‌చాట్ పెట్టారు. నవ్వుతూ సెల్ఫీలు దిగుతూ గడిపారు.లోకేష్ తీరును చూసిన సీనియర్ నేతలు ఆశ్చర్యపోయారు. సీఎం ఇంత సీరియస్‌గా మాట్లాడుతున్న సమయంలో లోకేష్ ఇలా వ్యవహరించడం ఏమిటని అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంకు లోకేషే మర్యాద ఇవ్వకపోతే కార్యకర్తలకు రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో కొందరు నేతలు కూడా సెల్‌ఫోన్లు చూసుకుంటూ ఉండిపోయారు. చంద్రబాబు ప్రసంగం కూడా సుధీర్ఘంగా సాగడంతో సభకు వచ్చిన కార్యకర్తలు కూడా డైవర్ట్ అయిపోయారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News