భూ వివాదంలో సచిన్‌ టెండూల్కర్‌

క్రికెట్‌ ద్వారా, యాడ్స్‌ ద్వారా వచ్చే వేలాది కోట్ల రూపాయల ఆదాయం చాలదన్నట్లు సచిన్‌ టెండూల్కర్‌ భూముల కొనుగోళ్లలోకి దిగారు. నెల్లూరు జిల్లాలో ఆయనకు కొన్ని భూములున్నాయి. ఆయన ఎంపీ నిధులతో నెలూరు జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తతకు తీసుకోవడం వెనుక అక్కడ ఆయనకు భూములు ఉండడమే కారణమని కొందరు విమర్శించారు. హైదరాబాద్‌ దగ్గరలోని పెద్ద చెరువు విస్తీర్ణం ఒకప్పుడు 1,800 ఎకరాలు. దాన్ని జనాలు ముక్కలు ముక్కలుగా ఆక్రమించి 884 ఎకరాలకు కుదించారు. ఇప్పుడు దాన్ని […]

Advertisement
Update: 2016-05-13 01:12 GMT

క్రికెట్‌ ద్వారా, యాడ్స్‌ ద్వారా వచ్చే వేలాది కోట్ల రూపాయల ఆదాయం చాలదన్నట్లు సచిన్‌ టెండూల్కర్‌ భూముల కొనుగోళ్లలోకి దిగారు. నెల్లూరు జిల్లాలో ఆయనకు కొన్ని భూములున్నాయి. ఆయన ఎంపీ నిధులతో నెలూరు జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తతకు తీసుకోవడం వెనుక అక్కడ ఆయనకు భూములు ఉండడమే కారణమని కొందరు విమర్శించారు.

హైదరాబాద్‌ దగ్గరలోని పెద్ద చెరువు విస్తీర్ణం ఒకప్పుడు 1,800 ఎకరాలు. దాన్ని జనాలు ముక్కలు ముక్కలుగా ఆక్రమించి 884 ఎకరాలకు కుదించారు. ఇప్పుడు దాన్ని మూడు వందల ఎకరాలకు పరిమితంచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలా అక్రమార్కులు ఆక్రమించిన భూమిని ఇతరులకు అమ్ముతున్నారు. రాజకీయనాయకులు, బిల్డర్‌లు, సినీ ప్రముఖులు, క్రికెటర్లు చౌకగా వస్తున్నాయని ఇలాంటి భూములను కొంటున్నారు. అలా కొన్న ప్రముఖుల్లో టెండూల్కర్‌ ఒకరు. ఆయన భార్య అంజలి టెండూల్కర్‌ పేరుతో ఆరు ఎకరాలు కొనడం గమనించదగ్గ విషయం. పెద్దమనిషిగా చెలామణిఅయ్యే టెండూల్కర్‌ లాంటి వ్యక్తి పోయిపోయి చెరువు ఆక్రమణలను కొనడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాంబేలో స్థిరపడ్డ టెండూల్కర్‌ ఎక్కడో దూరంగా ఉన్న రాష్ట్రాల్లో వివాదాస్పద భూములు కొనడం అవసరమా? అని బాధపడుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News