అబ్బే.. పసలేదండి!… బావ కళ్లలో ఆనందం కోసమే!

కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.  వైసీపీని వీడేందుకు  మోహన్ రెడ్డి కూడా కొన్ని కారణాలు చెప్పారు. అయితే ఆయన చెప్పిన కారణాల్లో పసలేదని వైసీపీ నేతలు అంటున్నారు.  అసలు కారణం కూడా చెబుతున్నారు. తన సోదరి కుమార్తె అయిన అభిలప్రియపై వచ్చే ఎన్నికల్లో తన చిన్నాన్న ఎస్వీ నాగిరెడ్డిని పోటీకి దింపాలని జగన్ భావించారని… ఆ విషయంలో తనపై ఒత్తిడి తెచ్చారని మోహన్ రెడ్డి చెప్పారు. ఈ అంశం తనకు […]

Advertisement
Update: 2016-05-06 23:51 GMT

కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. వైసీపీని వీడేందుకు మోహన్ రెడ్డి కూడా కొన్ని కారణాలు చెప్పారు. అయితే ఆయన చెప్పిన కారణాల్లో పసలేదని వైసీపీ నేతలు అంటున్నారు. అసలు కారణం కూడా చెబుతున్నారు.

తన సోదరి కుమార్తె అయిన అభిలప్రియపై వచ్చే ఎన్నికల్లో తన చిన్నాన్న ఎస్వీ నాగిరెడ్డిని పోటీకి దింపాలని జగన్ భావించారని… ఆ విషయంలో తనపై ఒత్తిడి తెచ్చారని మోహన్ రెడ్డి చెప్పారు. ఈ అంశం తనకు చాలా బాధ కలిగించిందని చెబుతున్నారు. ఇక్కడే మోహన్ రెడ్డి తీరును వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. అఖిలప్రియ టీడీపీలోకి వెళ్లిపోయారు… కాబట్టి వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ఆమెపై వైసీపీ నుంచి ఎవరినో ఒకరిని బరిలో దింపడం ఖాయం. అందుకోసం సరైన అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యత కూడా పార్టీ అధినాయక్వంపై ఉంటుంది. ఒకవేళ ఎస్వీ నాగిరెడ్డి అయితే బాగుంటుందని జగన్ భావించి ఉండవచ్చని చెబుతున్నారు. అందులో తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.

అంటే ఎస్వీ మోహన్ రెడ్డి దృష్టిలో టీడీపీలో ఉన్నా సరే అఖిలప్రియే గెలవాలని కోరుకుంటున్నారా?. వైసీపీ అభ్యర్థి ఓడిపోయినా పర్వాలేదనుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఒక కుటుంబంలోని వారిని బరిలో దింపి ఫ్యామిలీలో జగన్ చిచ్చు పెడుతున్నారని మోహన్ రెడ్డి భావించవచ్చు. ఆ కోణంలో ఆలోచిస్తే బావ భూమా, బామ్మరిది మోహన్ రెడ్డి ఒకే పార్టీలో ఉండకుండా ఒకరు టీడీపీలో, ఒకరు వైసీపీలో ఎందుకున్నట్టు అని ప్రశ్నిస్తున్నారు. ఎస్వీ నాగిరెడ్డిని జగన్ తెరపైకి తెస్తున్నారని మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం బట్టి… ఎస్వీ కుటుంబం నుంచి మరొకరు రాజకీయాల్లోకి రాకూడదని ఆయన భావిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు.

మోహన్ రెడ్డి చెబుతున్న కారణాలు కాకుండా వైసీపీ నేతలు కొన్ని విషయాలు చెబుతున్నారు. బావ భూమా కళ్లలో ఆనందం చూసేందుకే మోహన్ రెడ్డి టీడీపీలోకి వెళ్తున్నారని చెబుతున్నారు. టీడీపీలో మంత్రి పదవి ఆశిస్తున్న భూమా … చంద్రబాబు దగ్గర తన వెయిట్ మరింత పెంచుకునేందుకు టీడీపీలోకి రావాల్సిందిగా బామ్మరిదిపై ఒత్తిడి చేశారని అంటున్నారు. బావ కళ్లలో ఆనందం కోసమే చివరకు ఆయన టీడీపీలో చేరుతున్నారని చెబుతున్నారు. ఇక మిగిలిన ఎమ్మెల్యేల తరహాలోనే మోహన్ రెడ్డికి లాభాలు చేకూరాయని అంటున్నారు. మొత్తం మీద తాను వైసీపీలో ఉన్నా సరే బావ భూమా, మేనకోడలు అఖిల ప్రియ రాజకీయంగా ఎదురులేకుండా ఉండాలని మోహన్ రెడ్డి ఆశించినట్టుగా ఉన్నారంటున్నారు.

click to read-

Tags:    
Advertisement

Similar News