యాగంటి బ‌స‌వ‌య్య పెరుగుతున్న మాట నిజ‌మే: ఏఎస్ఐ

”యాగంటి బ‌స‌వ‌య్య అంత‌కంత‌కు పెరిగి క‌లియుగాంత‌మున లేచి రంకేలేసేను…”  తాను ర‌చించిన కాల‌జ్ఞానంలో పోతూలూరు వీర‌బ్ర‌హ్మేంద్ర‌స్వామి చెప్పిన మాట ఇది.  యాగంటి బ‌స‌వ‌య్య విగ్ర‌హానికి అంత ప్రాముఖ్య‌త ఉంద‌ని చెబుతుంటారు. క‌ర్నూలు జిల్లా యాగంటిలోని బ‌స‌వ‌య్య విగ్ర‌హం కాలంతో పాటు పెరుగుతోంద‌ని స్థానికులూ చెబుతూ ఉంటారు. దీనిపై భూగ‌ర్భ‌, గ‌నుల శాఖ‌కు చెందిన శాస్త‌వేత్త‌లు ప‌రిశోధ‌న చేశారు. ప్ర‌తి 10ఏళ్ల‌కొక‌సారి విగ్ర‌హం ఎత్తు, పొడువు వివ‌రాల‌ను సేకరిస్తూ వ‌చ్చిన అధికారులు… ప్ర‌తి 20 ఏళ్ల‌కు ఒక ఇంచ్ […]

Advertisement
Update: 2016-05-01 11:21 GMT

”యాగంటి బ‌స‌వ‌య్య అంత‌కంత‌కు పెరిగి క‌లియుగాంత‌మున లేచి రంకేలేసేను…” తాను ర‌చించిన కాల‌జ్ఞానంలో పోతూలూరు వీర‌బ్ర‌హ్మేంద్ర‌స్వామి చెప్పిన మాట ఇది. యాగంటి బ‌స‌వ‌య్య విగ్ర‌హానికి అంత ప్రాముఖ్య‌త ఉంద‌ని చెబుతుంటారు. క‌ర్నూలు జిల్లా యాగంటిలోని బ‌స‌వ‌య్య విగ్ర‌హం కాలంతో పాటు పెరుగుతోంద‌ని స్థానికులూ చెబుతూ ఉంటారు. దీనిపై భూగ‌ర్భ‌, గ‌నుల శాఖ‌కు చెందిన శాస్త‌వేత్త‌లు ప‌రిశోధ‌న చేశారు. ప్ర‌తి 10ఏళ్ల‌కొక‌సారి విగ్ర‌హం ఎత్తు, పొడువు వివ‌రాల‌ను సేకరిస్తూ వ‌చ్చిన అధికారులు… ప్ర‌తి 20 ఏళ్ల‌కు ఒక ఇంచ్ చొప్పున బ‌స‌వ‌య్య విగ్ర‌హం పెరిగిన‌ట్టు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఈ విగ్రహం ఎత్తు 5 అడుగులు, పొడ‌వు 15అడుగులుగా ఉంది.

ఈ విగ్ర‌హంలోని సిలికా, ఇసుక రేణువుల వ‌ల్ల కొన్ని ర‌సాయ‌నిక చ‌ర్య‌లు జ‌రిగి విగ్ర‌హం పెరుగుతున్న మాట వాస్త‌వ‌మేన‌ని మైన్స్ అండ్ జియాల‌జీ అసిస్టెంట్ డైరెక్ట్ సి. మోహ‌న్‌రావు చెప్పారు. ఈ నంది విగ్ర‌హం ఉన్న ఆల‌యాన్ని విజ‌య‌న‌గ‌ర రాజు హ‌రిహ‌ర బుక్క‌రాయలు నిర్మించారు. అగ‌స్త్య ముని ఇక్క‌డ ఏర్పాటు చేసిన విగ్ర‌హం ఉమామ‌హేశ్వ‌ర‌స్వామిగా పూజ‌లందుకుంటున్నారు. యాగంటిలో ఒక్క కాకి కూడా క‌నిపించ‌దు. ఇందుకు ముని శాప‌మే కార‌ణ‌మ‌ని చెబుతుంటారు. మొత్తం మీద శాస్త్రవేత్త‌లు కూడా యాగంటి బ‌స‌వ‌య్య విగ్ర‌హం సైజు పెరుగుతున్న మాట వాస్త‌వ‌మేన‌ని ప్ర‌క‌టించ‌డంతో అంద‌రిలోనూ ఆస‌క్తి మ‌రింత పెరిగింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News