టీడీపీకి మగాళ్ల అవసరం ఉందా?- మళ్లీ పంచ్ డైలాగులు పేల్చిన రోజా

చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి నిప్పులు చెరిగారు. విశాఖ రైల్వేజోన్ కోసం దీక్ష చేస్తున్న వైసీపీ నేత అమర్‌నాథ్‌కు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన రోజా… చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నారు కాబట్టే చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారన్నారు. చంద్రబాబు సీఎం కావడమే రాష్ట్రానికి శాపంగా తయారైందన్నారు. చంద్రబాబు, మంత్రులు దద్దమ్మలు కాబట్టే ప్రత్యేక రైల్వే జోన్‌ కోసం తాము పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. టీడీపీలో మగాళ్లు లేరు […]

Advertisement
Update: 2016-04-17 03:45 GMT

చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి నిప్పులు చెరిగారు. విశాఖ రైల్వేజోన్ కోసం దీక్ష చేస్తున్న వైసీపీ నేత అమర్‌నాథ్‌కు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన రోజా… చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నారు కాబట్టే చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారన్నారు. చంద్రబాబు సీఎం కావడమే రాష్ట్రానికి శాపంగా తయారైందన్నారు.

చంద్రబాబు, మంత్రులు దద్దమ్మలు కాబట్టే ప్రత్యేక రైల్వే జోన్‌ కోసం తాము పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. టీడీపీలో మగాళ్లు లేరు కాబట్టే చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను కొని తీసుకెళ్తున్నారని రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. ఉత్తరాంధ్ర మంత్రులకు దోపిడి మీద ఉన్నంత శ్రద్ధ రైల్వే జోన్‌పై లేకుండా పోయిందన్నారు. అడ్డదిడ్డంగా మాట్లాడే అచ్చెన్నాయుడు ఏనాడైనా రైల్వే జోన్‌ కోసం పోరాడారా అని నిలదీశారు. కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం రూ. 10 వేల కోట్లు అడిగితే చివరకు రూ. 700 కోట్లు కేటాయించిందని, అయినా చంద్రబాబు నోరు మెదపడం లేదని రోజా విమర్శించారు. ఓటుకు నోటు కేసుకు భయపడే చంద్రబాబు ఇలా మౌనంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News