చంద్రబాబు కొత్త రాజకీయం... తమ్ముళ్ల తికమక

ప్రజాస్వామ్యంలో ప్రజాసంఘాల పాత్ర చాలా కీలకం. ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శ కన్నా ప్రజాసంఘాలు చేసే విమర్శలకు విలువ ఎక్కువుంటుంది. వెనుకబడిన వర్గాలకు సంబంధించిన సంఘాల నేతల గొంతు కూడా అంతే విలువైనది.ఈ  కేటగిరిలోకి జనంలో మంచి పేరున్న మహనీయులు కూడా వస్తారు. ఇలా ప్రజాసంఘాలు, వెనుకబడిన వర్గాల నేతలు, పేరున్న ప్రముఖులు చేసే విమర్శల ప్రభావం పాలకులపై చాలా ఉంటుంది. అందుకే చంద్రబాబు కొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టారని చెబుతున్నారు. ప్రజాసంఘాల నేతలు, కుల సంఘాల […]

Advertisement
Update: 2016-04-15 02:11 GMT

ప్రజాస్వామ్యంలో ప్రజాసంఘాల పాత్ర చాలా కీలకం. ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శ కన్నా ప్రజాసంఘాలు చేసే విమర్శలకు విలువ ఎక్కువుంటుంది. వెనుకబడిన వర్గాలకు సంబంధించిన సంఘాల నేతల గొంతు కూడా అంతే విలువైనది.ఈ కేటగిరిలోకి జనంలో మంచి పేరున్న మహనీయులు కూడా వస్తారు. ఇలా ప్రజాసంఘాలు, వెనుకబడిన వర్గాల నేతలు, పేరున్న ప్రముఖులు చేసే విమర్శల ప్రభావం పాలకులపై చాలా ఉంటుంది. అందుకే చంద్రబాబు కొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టారని చెబుతున్నారు. ప్రజాసంఘాల నేతలు, కుల సంఘాల నాయకులను మచ్చిక చేసుకుంటున్నారని చెబుతున్నారు.

ఏపీలో తన ప్రవచనాల ద్వారా తిరుగులేని పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న చాగంటి కోటేశ్వరరావును ప్రభుత్వ సలహాదారుగా నియమించడం ద్వారా ఆయనకున్న ఫాలోయింగ్‌తో టీడీపీ పట్ల సానుకూలత ఏర్పరచుకునేందుకు చంద్రబాబు ఎత్తువేశారని చెబుతున్నారు. అయితే చాగంటి కోటేశ్వరరావు ప్రభుత్వ సలహాదారు పదవికి వంద శాతం అర్హులే. ఇంకా చెప్పాలంటే ఆయనకు ఆ పదవి చాలా చిన్నది.

వైసీపీలో ఉన్న జూపూడిప్రభాకర్ టీడీపీలోకి రాగానే ఏళ్ల తరబడి టీడీపీని నమ్ముకుని పనిచేస్తున్న ఎంతో మంది దళిత నాయకులున్నా వెంటనే జూపూడికి చంద్రబాబు కార్పొరేషన్ పదవి కట్టబెట్టారు. తాజాగా కారెం శివాజీకి కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారు. కారెం శివాజీకి పదవి ఇవ్వడంపై దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న దళితనాయకులు, మాజీ ఎమ్మెల్యేలు ఆగ్రహంగా ఉన్నారు.

తమను కాదని పార్టీకి ఎలాంటి సేవ చేయని కారెం శివాజీకి ఎలా పదవి కట్టబెడుతారని ప్రశ్నిస్తున్నారు. అయితే అలాంటి నేతలకు కొందరు సీనియర్లు జ్ఞానబోధ చేస్తున్నారు. అయితే జూపూడి, కారెం శివాజీకి చంద్రబాబు పదవులు కట్టబెట్టడం వెనుక పెద్ద కథే ఉందని చెబుతున్నారు. కారెం శివాజీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసేందుకంటూ మేధావి చలసాని శ్రీనివాస్‌, ఇటీవల పెద్దగా యాక్టివ్ గా లేని నటుడు శివాజీ తదితరులతో కలిసి ఏర్పడిన బృందంలో కూడా ఉన్నారు. పైగా దళిత సంఘం నేత. కాబట్టి ఆయన చేసే విమర్శలకు విలువ ఎక్కువగా ఉంటుంది.

జూపూడి కూడా మాల సామాజికవర్గానికి నాయకత్వం వహించిన వారే కాబట్టి ఇలాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆయా సామాజికవర్గాల్లో సానుకూల దృక్పతంతో పాటు… ప్రజాసంఘాల తరపున ప్రభుత్వంపై విమర్శలు చేసే వారి సంఖ్యను కుదించినట్టు అవుతుంది. అందుకే జనంలోగానీ, ఆయా సామాజికవర్గాల్లోగానీ కాసింత పట్టు, నోరు ఉన్న నాయకులకు చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయం తెలియక దశబ్దాలుగా క్రమశిక్షణతో మౌనంగా పనిచేసుకుపోయిన టీడీపీ నేతలు కొందరు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు ఏం చేసినా ఒక లెక్క ఉంటుంది కదా!.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News