వైసీపీ ఎమ్మెల్యేను పూచికపుల్లలా తీసేసిన చంద్రబాబు

చిత్తూరు జిల్లా మదనపల్లి వైసీపీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి విషయంలో సీఎం చంద్రబాబు అనుచితంగా ప్రవర్తించారన్న విషయం చర్చనీయాంశమైంది. ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తనను చంద్రబాబు అవమానించారని తిప్పారెడ్డి మండిపడ్డారు. శనివారం మదనపల్లి పర్యటనకు వచ్చిన చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి హెలిపాడ్ వద్ద కలిశారు. తన నియోజకవర్గంలోని సమస్యలకు సంబంధించి 13 పేజీల వినతిపత్రాన్ని అందజేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరారు. వినతిపత్రం తీసుకున్న చంద్రబాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఎమ్మెల్యే ఇచ్చిన […]

Advertisement
Update: 2016-04-10 22:35 GMT

చిత్తూరు జిల్లా మదనపల్లి వైసీపీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి విషయంలో సీఎం చంద్రబాబు అనుచితంగా ప్రవర్తించారన్న విషయం చర్చనీయాంశమైంది. ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తనను చంద్రబాబు అవమానించారని తిప్పారెడ్డి మండిపడ్డారు. శనివారం మదనపల్లి పర్యటనకు వచ్చిన చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి హెలిపాడ్ వద్ద కలిశారు. తన నియోజకవర్గంలోని సమస్యలకు సంబంధించి 13 పేజీల వినతిపత్రాన్ని అందజేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరారు. వినతిపత్రం తీసుకున్న చంద్రబాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అయితే ఎమ్మెల్యే ఇచ్చిన వినతిపత్రాన్ని హెలిపాడ్ వద్ద నేలపై పడేసి వెళ్లిపోయారు సీఎం. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు… వెంటనే ఫోన్ చేసి మీడియా ప్రతినిధులు, ఎమ్మెల్యే తిప్పారెడ్డికి సమాచారం అందించారు. చంద్రబాబు తీరుపై ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై వినతిపత్రం ఇస్తే ఒక ముఖ్యమంత్రిస్థాయిలో ఉన్న వ్యక్తి దాన్నిఇలా హెలిపాడ్ వద్ద కింద పడేసి వెళ్లడం చాలా బాధగా ఉందన్నారు. చంద్రబాబు పక్షపాత ధోరణికి ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా తననొక్కడినే కాదు … మదనపల్లి నియోజకవర్గానికి చెందిన నాలుగు లక్షల మంది ఓటర్లను అవమానించారని ఎమ్మెల్యే అన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News