జగన్‌ కేసు కంచికేనా? కేంద్రం కీలక నిర్ణయం

జగన్‌ ఆస్తుల కేసు రోజురోజుకు బలహీనపడుతోందా అన్న అనుమానం కలుగుతోంది. ఇప్పటికే  జగన్‌ ఆస్తుల కేసులో ఇండియా సిమెంట్స్ అధినేత  శ్రీనివాసన్, సీనియర్ అధికారులు మహంతి, బీపీ ఆచార్యపై హైకోర్టు విచారణ నిలిపివేయగా… ఇప్పుడు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.  జగన్ ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్‌ అధికారి  శ్యాంబాబుకు కేంద్రం క్లీన్ చిట్ ఇచ్చింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ భూముల కేటాయింపులో అవకతవకలు జరిగాయని దీని వెనుక శ్యాంబాబు ప్రమేయం కూడా […]

Advertisement
Update: 2016-04-04 11:40 GMT

జగన్‌ ఆస్తుల కేసు రోజురోజుకు బలహీనపడుతోందా అన్న అనుమానం కలుగుతోంది. ఇప్పటికే జగన్‌ ఆస్తుల కేసులో ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్, సీనియర్ అధికారులు మహంతి, బీపీ ఆచార్యపై హైకోర్టు విచారణ నిలిపివేయగా… ఇప్పుడు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్‌ అధికారి శ్యాంబాబుకు కేంద్రం క్లీన్ చిట్ ఇచ్చింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ భూముల కేటాయింపులో అవకతవకలు జరిగాయని దీని వెనుక శ్యాంబాబు ప్రమేయం కూడా ఉందని సీబీఐ అభియోగం మోపింది. అయితే శ్యాంబాబు బిజినెస్ రూల్స్‌ ఉల్లంఘించినట్టుగా ఆధారాలు లేవని భావించిన కేంద్ర ప్రభుత్వం ఆయనపై విచారణకు నిరాకరించింది. దీంతో శ్యాంబాబు ఈ కేసు నుంచి బయటపడిపోయినట్టే. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్‌ ఆస్తులన్నీ క్విడ్ ప్రో అంటూ సీబీఐ కేసులు నమోదు చేసింది. మరి అదే సమయంలో అప్పటి ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులది తప్పులేదని తేలినప్పుడు ఇక జగన్‌పై కేసు ఎలా నిలబడుతుందని న్యాయనిపుణులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు,నాటి మంత్రులది తప్పు లేనప్పుడు ఏ పదవిలోనూ లేని జగన్‌ దోషి ఎలా అవుతారని ప్రశ్నిస్తున్నారు.

lick on Image to Read:

Tags:    
Advertisement

Similar News