ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి బదిలీ.. కొత్తగా ఎవరంటే!

తెలుగుదేశం పార్టీ ఫిర్యాదుతోనే ఈ బదిలీ చేసినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు వరుసగా అధికారులను టార్గెట్ చేస్తూ వస్తున్నారు.

Advertisement
Update: 2024-05-05 13:25 GMT

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు పడింది. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదిలీ వేటు వేసింది ఎలక్షన్ కమిషన్. వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి పనులు ఆయనకు అప్పగించకూడదని సూచించింది.

ఇక కొత్త డీజీపీ కోసం డీజీ ర్యాంకు ఉన్న ముగ్గురి పేర్లతో ప్యానల్ పంపాలని సీఎస్‌ను ఆదేశించింది ఈసీ. సోమవారం ఉదయం 11 గంటల లోపు కొత్త పేర్లతో జాబితా పంపాలని సూచించింది.



తెలుగుదేశం పార్టీ ఫిర్యాదుతోనే ఈ బదిలీ చేసినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు వరుసగా అధికారులను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ఫిర్యాదుతో పలువురు ఉన్నతాధికారులపై బదిలీ వేటు పడింది. ఇక ఏపీ సీఎస్, డీజీపీలను బదిలీ చేయాలని శనివారం ఈసీని డిమాండ్ చేసింది తెలుగుదేశం.

Tags:    
Advertisement

Similar News