జగన్‌కే కాదు ఎవరికీ అనుభవం లేదు

జగన్‌ ఏం మాట్లాడినా యనమల లేచిన ప్రతిసారి నిర్లక్ష్యంగా మొహం పెట్టి చెప్పే మొదటి డైలాగ్‌ ఒక్కటే! టీవీలు చూసే ప్రతి ఒక్కళ్ళకీ ఆ డైలాగ్‌ నోటికి వచ్చేసింది. “కొత్తగా సభకొచ్చారు. సభా సంప్రదాయాలు తెలియవు, నేర్చుకోరు”  అని. చంద్రబాబు చెప్పేది కూడా ఇదే డైలాగ్‌. నిజమే. జగన్‌కి అసెంబ్లీ కొత్త. చాలా మంది వైఎస్‌ఆర్‌సిపి వాళ్ళకు అసెంబ్లీ కొత్త! యనమల చెప్పింది నిజమే!అయితే వాళ్ళు మర్చిపోయింది ఏమిటంటే జగన్‌కే కాదు. 30,40 ఏళ్ళ నుంచి అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌ […]

Advertisement
Update: 2016-03-31 03:11 GMT

జగన్‌ ఏం మాట్లాడినా యనమల లేచిన ప్రతిసారి నిర్లక్ష్యంగా మొహం పెట్టి చెప్పే మొదటి డైలాగ్‌ ఒక్కటే! టీవీలు చూసే ప్రతి ఒక్కళ్ళకీ ఆ డైలాగ్‌ నోటికి వచ్చేసింది. “కొత్తగా సభకొచ్చారు. సభా సంప్రదాయాలు తెలియవు, నేర్చుకోరు” అని. చంద్రబాబు చెప్పేది కూడా ఇదే డైలాగ్‌.

నిజమే. జగన్‌కి అసెంబ్లీ కొత్త. చాలా మంది వైఎస్‌ఆర్‌సిపి వాళ్ళకు అసెంబ్లీ కొత్త! యనమల చెప్పింది నిజమే!అయితే వాళ్ళు మర్చిపోయింది ఏమిటంటే జగన్‌కే కాదు. 30,40 ఏళ్ళ నుంచి అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌ గమనిస్తున్న వాళ్ళకు కూడా ఇప్పుడు నడుస్తున్న అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌ కొత్తగా ఉన్నాయి, ఎవరికి ఏమీ తెలియడం లేదు. అసెంబ్లీ వార్తలు కవర్‌ చేసే తలపండిన జర్నలిస్టులకు కూడా కోడెల అధ్యక్షతన నడుస్తున్న సభ కొత్తగా ఉంది. ఆయన పాటిస్తున్న సంప్రదాయాలు కొత్తగా ఉన్నాయి, విచిత్రంగా వున్నాయి.

బహుశా శాసనసభల నియమ నిబంధనలు తయారు చేసిన వాళ్ళుకూడా యనమల కొత్తగా చేస్తున్న ప్రతిపాదనలు, కోడెల ఇస్తున్న రూలింగ్స్‌ చూస్తే ఇలాంటి నియమ నిబంధనలు మనం తయారు చేసినవేనా? లేక మా రాతలకు వీళ్ళిద్దరూ కొత్త భాష్యాలు, కొత్త వ్యాఖ్యానాలు చెబుతున్నారా? అని ఆశ్చర్యపోక తప్పదు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మత రాజకీయాలు చూశారు, కుల రాజకీయాలు చూశారు, ఫ్యాక్షన్‌ రాజకీయాలు చూశారు. కాని ఇలాంటి అసెంబ్లీ రాజకీయాలు చూడడం ఇదే మొదలు. ఆ ఘనత స్పీకర్ కోడెల శివప్రసాద్‌ గారికి దక్కుతుంది. రాబోయే తరాలుకూడా మర్చిపోలేని విలక్షణ స్పీకర్‌గా కోడెల చరిత్రలో నిలిచిపోతారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News