సేవకు చంద్రబాబుకు తేడా అదే!

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ. రెండు తెలుగు రాష్ట్రాలే. మనషుల వ్యక్తిత్వం కూడా దాదాపు ఒకేలా ఉంటుంది. కానీ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలు మాత్రం పూర్తి విరుద్ధంగా నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షానికి మధ్య అసెంబ్లీలోనే యుద్ధం నడుస్తోంది. రాజకీయం కోసమే  రాజకీయం చేస్తున్నట్టుగా ఉంది. తెలంగాణలో మాత్రం ఇందుకు కాసింత భిన్నమైన పరిస్థితే కనిపిస్తోంది. పార్టీల మధ్య విభేదాలు ఉన్నా అవి మంచివాతావరణాన్ని సృష్టించేవిగానే ఉన్నాయి. రెండు ప్రభుత్వాల మధ్య తేడా స్పష్టంగా తెలుసుకునేందుకు నియోజకవర్గాల స్పెషల్ […]

Advertisement
Update: 2016-03-30 07:51 GMT

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ. రెండు తెలుగు రాష్ట్రాలే. మనషుల వ్యక్తిత్వం కూడా దాదాపు ఒకేలా ఉంటుంది. కానీ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలు మాత్రం పూర్తి విరుద్ధంగా నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షానికి మధ్య అసెంబ్లీలోనే యుద్ధం నడుస్తోంది. రాజకీయం కోసమే రాజకీయం చేస్తున్నట్టుగా ఉంది. తెలంగాణలో మాత్రం ఇందుకు కాసింత భిన్నమైన పరిస్థితే కనిపిస్తోంది. పార్టీల మధ్య విభేదాలు ఉన్నా అవి మంచివాతావరణాన్ని సృష్టించేవిగానే ఉన్నాయి. రెండు ప్రభుత్వాల మధ్య తేడా స్పష్టంగా తెలుసుకునేందుకు నియోజకవర్గాల స్పెషల్ డెవలప్‌మెట్ ఫండ్‌ అంశం చాలు. ఈ అంశం రెండు సభల్లోనూ ఒకేసారి ప్రస్తావనకు రావడం కూడా యాదృశ్చికమే.

స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌ ప్రస్తుతం రూ. కోటి 50 లక్షలు ఉండగా దాన్ని ఐదు కోట్లకు పెంచాలని తెలంగాణ సభలో విపక్ష నేత జానారెడ్డి కోరారు. ఇందుకు పార్టీలకతీతంగా అందరూ మద్దతు పలికారు. తొలుత రెండు కోట్లకు పెంచేందుకు ఒప్పుకున్న కేసీఆర్‌… ఒకే సారి రూ. 5 కోట్లకు పెంచడం నిబంధనలకు విరుద్దమని చెప్పి చివరకు రూ. 3 కోట్లకు పెంచారు. ఇందుకు విపక్ష సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు ఎంపీ నిధుల తరహాలోనే రూ. 3 కోట్లను ఎలా ఖర్చు చేయాలన్న స్వేచ్చను ఎమ్మెల్యేలకే ఇస్తున్నట్టు కేసీఆర్‌ ప్రకటించారు. అంటే పార్టీలకతీతంగా అందరూ ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏడాదికి రూ. 3 కోట్లు అందుతాయి. ఇక ఏపీ సంగతి చూస్తే…

బుధవారం ఉదయం నియోజకవర్గ అభివృద్ధి నిధులపై ఏపీ అసెంబ్లీలోనూ ప్రస్తావన వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం ఎస్‌డీఎఫ్‌ నిధులను కూడా రాజకీయకోణంలో లెక్కకట్టింది. నేరుగా ఎమ్మెల్యేలకు నిధులు ఇస్తే వైసీపీ సభ్యులకు కేటాయించాల్సి వస్తుంది. అందుకే ఈ నిధులను సీఎం దగ్గర పెట్టుకున్నారు. అంతటితో ఆగలేదు. ఎమ్మెల్యేల చేతుల మీద ఖర్చు పెట్టాల్సిన ఈ నిధులను మొన్నటి ఎన్నికల్లో ప్రజల చేత తిరస్కరించబడి, ఓడిపోయిన టీడీపీ నేతల పేరు మీద విడుదల చేస్తున్నారు. ఇందుకు సంబంధించి నేరుగా జీవోలనే జారీ చేశారు. ఇలా ఎమ్మెల్యేలను పక్కన పడేసి ఓడిపోయిన వారికి ఎలా నిధులు కేటాయిస్తారని వైసీపీ ప్రశ్నిస్తే యనమల రామకృష్ణుడు రాజకీయ కోణంలోనే సమాధానం చెప్పారు.

నిధులు కావాలనుకునే వైసీపీ ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబును కలవాలని అసెంబ్లీలోనే చెప్పారు. సీఎంను కలిస్తే పరీక్షించి నిధులు మంజూరు చేస్తారని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి అన్ని పార్టీల ఎమ్మెల్యేలను సమదృష్టితో చూసి ప్రతి ఎమ్మెల్యేకు రూ. 3కోట్ల నిధులు కేటాయిస్తే… ఇక్కడ చంద్రబాబు మాత్రం ఎస్‌డీఎఫ్ నిధులను కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తనచుట్టూ తిప్పుకోవడానికి వాడుకుంటున్నారు. అది కేసీఆర్‌ రాజకీయానికి చంద్రబాబు సేవకు తేడా.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News