నీచరాతలు రాసిన రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి

అసెంబ్లీ అధికారపక్షం తనను టార్గెట్ చేసుకుందని వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. తాను సభలో చేయని తప్పులకు కూడా శిక్ష వేస్తున్నారని ఆవేదన చెందారు. అసెంబ్లీ రికార్డుల్లోని విషయాలను రాధాకృష్ణ తన ప్రతికలో రాసుకున్నారని ఇది సభా హక్కుల ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు. నీలాగా ఎవరితో పడితే వారితో పడుకోను అని తాను అన్నట్టుగా రాధాకృష్ణ రాశారంటూ ఆంధ్రజ్యోతి పత్రికను చూపించారు.  అసెంబ్లీ రికార్డుల్లోని మాటలను రాధాకృష్ణకు ఎలా తెలిశాయని ప్రశ్నించారు. అసెంబ్లీ ప్రసార హక్కులను […]

Advertisement
Update: 2016-03-25 02:21 GMT

అసెంబ్లీ అధికారపక్షం తనను టార్గెట్ చేసుకుందని వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. తాను సభలో చేయని తప్పులకు కూడా శిక్ష వేస్తున్నారని ఆవేదన చెందారు. అసెంబ్లీ రికార్డుల్లోని విషయాలను రాధాకృష్ణ తన ప్రతికలో రాసుకున్నారని ఇది సభా హక్కుల ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు.

నీలాగా ఎవరితో పడితే వారితో పడుకోను అని తాను అన్నట్టుగా రాధాకృష్ణ రాశారంటూ ఆంధ్రజ్యోతి పత్రికను చూపించారు. అసెంబ్లీ రికార్డుల్లోని మాటలను రాధాకృష్ణకు ఎలా తెలిశాయని ప్రశ్నించారు. అసెంబ్లీ ప్రసార హక్కులను ఏబీఎన్‌కు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.(ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ ప్రసారాల హక్కులను ప్రభుత్వం ఏబీఎన్‌కు అప్పగించింది) లైవ్ ప్రసారాలను టెలికాస్ట్ మాత్రమే చేయాల్సిన రాధాకృష్ణ చానల్‌ ఇలా వీడియోను కట్‌ చేసి ఎలా ప్రసారం చేస్తుందని ప్రశ్నించారు.

సోషల్ మీడియాలోకి లీక్ అయిన వీడియోను తాను విడుదల చేయలేదని స్పీకర్ చెబుతున్నారని మరి అవి ఎలా బయటకు వచ్చాయని ప్రశ్నించారు. వీడియోలను విడుదల చేసిన కాలువ శ్రీనివాస్, నీచరాతలు రాసిన రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరో సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలోకి వదిలారంటున్నారని … మరి అసెంబ్లీలోకి వచ్చి ఎవరో సెల్‌ఫోన్‌లో రికార్డు చేస్తుంటే స్పీకర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అలా రికార్డుచేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని రోజా ప్రశ్నించారు.

వీడియోలను ఎవరు లీక్ చేశారన్న దానిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని తాము డిమాండ్ చేస్తే ప్రివిలేజ్ కమిటీ ఎందుకు తిరస్కరించిందన్నారు. సైబర్ పోలీసులు రంగంలోకి దిగితే వీడియోలు ఎలా బయటకు వచ్చాయో గుట్టురట్టు అవుతుందన్న భయంతోనే ఇలా చేశారని రోజా ఆరోపించారు. అసెంబ్లీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి తనను ఇష్టానుసారం తిడుతుంటే అడ్డుకోవాల్సింది పోయి తిరిగి తననే స్పీకర్ హోల్డ్ యువర్ టంగ్ అన్నారని రోజా ఆవేదన చెందారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News