ప్లేటు మార్చిన ప్రభుత్వం

రోజా వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం మొండిగానే ముందుకెళ్తోంది. చట్టసభల నిర్ణయాలను ప్రశ్నించే అధికారం కోర్టులకు లేదని వాదించిన టీడీపీ నేతలు… ఆ వాదనపై ఎదురవుతున్న విమర్శల నేపథ్యంలో రూటు మార్చారు. చట్టసభలను ప్రశ్నించే అధికారం కోర్టులకు లేదని చెబుతున్న ప్రభుత్వం తిరిగి కోర్టులో అప్పిల్ ఎందుకు చేసిందని ప్రతిపక్షం నుంచి ప్రధానంగా ఎదురైన ప్రశ్న. ఇందుకు సమాధానం చెప్పుకోవడానికి అధికారపక్షం తడబడింది. ఈనేపథ్యంలో టీడీపీ నేతలు కొత్త వాదన తెరపైకి తెచ్చారు. హైకోర్టులో అసెంబ్లీ కార్యదర్శి వేసిన పిటిషన్ అసలు అప్పీల్‌ […]

Advertisement
Update: 2016-03-20 22:05 GMT

రోజా వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం మొండిగానే ముందుకెళ్తోంది. చట్టసభల నిర్ణయాలను ప్రశ్నించే అధికారం కోర్టులకు లేదని వాదించిన టీడీపీ నేతలు… ఆ వాదనపై ఎదురవుతున్న విమర్శల నేపథ్యంలో రూటు మార్చారు. చట్టసభలను ప్రశ్నించే అధికారం కోర్టులకు లేదని చెబుతున్న ప్రభుత్వం తిరిగి కోర్టులో అప్పిల్ ఎందుకు చేసిందని ప్రతిపక్షం నుంచి ప్రధానంగా ఎదురైన ప్రశ్న. ఇందుకు సమాధానం చెప్పుకోవడానికి అధికారపక్షం తడబడింది.

ఈనేపథ్యంలో టీడీపీ నేతలు కొత్త వాదన తెరపైకి తెచ్చారు. హైకోర్టులో అసెంబ్లీ కార్యదర్శి వేసిన పిటిషన్ అసలు అప్పీల్‌ కోసం కాదంటున్నారు. చట్టసభల్లో జోక్యం చేసుకునేందుకు వీలు లేదంటూ కోర్టులకు గుర్తు చేయడం కోసమే పిటిషన్ వేశామని చెబుతున్నారు. అది అప్పిల్ పిటిషన్‌ కాదు… కోర్టుల పరిధిని తెలియజేసే పిటిషన్ అంటున్నారు. ఆర్టికల్ 212 ప్రకారం శాసనసభ తీసుకున్న నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని … శాసనసభకున్న స్వతంత్ర ప్రతిపత్తిని గుర్తు చేసేందుకే పిటిషన్ వేయించామని టీడీపీ నేతలు చెబుతున్నారు.

రోజా విషయంలో కోర్టు తీర్పును పాటిస్తే భవిష్యత్తులో కోర్టులు పదేపదే చట్టసభల తీరుతెన్నులపై జోక్యం చేసుకుంటాయన్నది ప్రభుత్వ కొత్త వాదనగా వినిపిస్తోంది. అయితే అప్పిల్ కాదు.. అధికారాలను గుర్తు చేసేందుకే పిటిషన్ అని చెప్పడం ద్వారా వైసీపీ విమర్శలకు సమాధానం చెప్పగలిగినా… కోర్టులతో మరింత ఘర్షణ పడినట్టే అవుతుందని మరికొందరు టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Click on Image to Read:

Advertisement

Similar News