శత్రు శేషం ఉండొద్దు

శత్రు శేషం ఉండొద్దు. మరొక విశ్వసనీయ నాయకుడు తయారు కావద్దు. తెలంగాణాను పది కాలాల పాటు పాలించాలంటే ఇంకొక రాజకీయ శక్తి ఏదీ బతకొద్దు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహం ఇది. అందుకే ఇప్పుడు రాజకీయ జేఏసీ నేత కోదండరాముని ఏకాకిని చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ పై ఎవరు విమర్శలు చేసినా ప్రజలు పట్టించుకునే అవకాశం లేదు. కోదండరామ్ ఒక్కడే అందుకు మినహాయింపు. కేసీఆర్ కు తెలంగాణా సమస్యలపై ఎంత పట్టు ఉందో…అంతకంటే ఎక్కువ పట్టు […]

Advertisement
Update: 2016-03-20 04:46 GMT

శత్రు శేషం ఉండొద్దు. మరొక విశ్వసనీయ నాయకుడు తయారు కావద్దు. తెలంగాణాను పది కాలాల పాటు పాలించాలంటే ఇంకొక రాజకీయ శక్తి ఏదీ బతకొద్దు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహం ఇది. అందుకే ఇప్పుడు రాజకీయ జేఏసీ నేత కోదండరాముని ఏకాకిని చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ పై ఎవరు విమర్శలు చేసినా ప్రజలు పట్టించుకునే అవకాశం లేదు. కోదండరామ్ ఒక్కడే అందుకు మినహాయింపు. కేసీఆర్ కు తెలంగాణా సమస్యలపై ఎంత పట్టు ఉందో…అంతకంటే ఎక్కువ పట్టు ఉంది కోదండరాముకు. చాలా మందికి కేసీఆర్ పై ఎంతనమ్మకం ఉందో, కోదండరామ్ పై అంతకంటే ఎక్కువ నమ్మకం ఉంది.

నిజాయితీ విషయంలో కేసీఆర్ పై కోదండరామ్ దే పైచేయి. అందుకే కేసీఆర్ ఇప్పుడు ఆయనను చూసి భయపడుతున్నారు. ఆయన ఇంకా బలపడక ముందే ఆయనను జీరో చేయాలని కేసీఆర్ ఎత్తులు వేస్తున్నారు. ఒక్కొక్క సంఘమే జేఏసీతో సంబంధం లేదని ప్రకటనలు చేయడం అందులో భాగమే. కోదండరామ్ ఎప్పటికైనా బలపడి, కాంగ్రెస్, ఇతర రాజకీయ పక్షాలతో జట్టు కడితే తనకు సవాలుగా మారవచ్చునని కేసీఆర్ తలపొస్తున్నారెమో. కేసీఆర్ ప్రతిపక్షాలకు కోదండరామ్ అనే మంచి నాయకుడిని అందించిన వాడవుతారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News