జగన్‌ కోసమే హైకోర్టు విభజన జరగడం లేదు

హైకోర్టు విభజన ఆలస్యంపై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు విభజన జరక్కపోవడానికి, జగన్‌ ఆస్తుల కేసుకు సంబంధం ఉందన్నారు. హైకోర్టు విభజన జరిగితే జగన్‌ ఆస్తుల కేసులన్నీ తెలంగాణ హైకోర్టు పరిధిలోకి వస్తాయన్నారు. అప్పుడు జగన్‌ కేసుల్లో జోక్యంచేసుకునే అవకాశం ఏపీ ప్రభుత్వానికి ఒక్కశాతం కూడా ఉండదన్నారు. జగన్ కేసులన్నీ తెలంగాణ న్యాయశాఖ పరిధిలోకి వస్తాయని, అప్పుడు జగన్‌ కేసులపై ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం కూడా ఉండదన్నారు. ఇలా జగన్‌ ఆస్తులపై […]

Advertisement
Update: 2016-03-16 05:14 GMT

హైకోర్టు విభజన ఆలస్యంపై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు విభజన జరక్కపోవడానికి, జగన్‌ ఆస్తుల కేసుకు సంబంధం ఉందన్నారు. హైకోర్టు విభజన జరిగితే జగన్‌ ఆస్తుల కేసులన్నీ తెలంగాణ హైకోర్టు పరిధిలోకి వస్తాయన్నారు. అప్పుడు జగన్‌ కేసుల్లో జోక్యంచేసుకునే అవకాశం ఏపీ ప్రభుత్వానికి ఒక్కశాతం కూడా ఉండదన్నారు.

జగన్ కేసులన్నీ తెలంగాణ న్యాయశాఖ పరిధిలోకి వస్తాయని, అప్పుడు జగన్‌ కేసులపై ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం కూడా ఉండదన్నారు. ఇలా జగన్‌ ఆస్తులపై పట్టుకోల్పోవడం ఇష్టలేకనే చంద్రబాబు హైకోర్టు విభజనను అడ్డుకుంటున్నారని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ ఆరోపించారు. హైకోర్టు ఉమ్మడిగా ఉంటే జగన్‌ ఆస్తుల కేసులను ప్రభావితం చేయవచ్చన్న భావన చంద్రబాబులో ఉందని ఆరోపించారు. జగన్‌ కేసులపై తాను పట్టుకోల్పోకూడదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ఇలాచేస్తున్నారని విమర్శించారు. కుట్రపూరితంగా హైకోర్టు విభజనకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.

ప్రస్తుతం హైకోర్టులో 49 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా కేవలం 23 మంది మాత్రమే ఉన్నారన్నారు. 23 మందిలోనూ తెలంగాణకు చెందిన న్యాయమూర్తుల సంఖ్య కేవలం నాలుగురేనన్నారు. ఆ నలుగురిలోనూ ఒకరు ఇటీవలే రిటైర్ అవగా… మరొకరు ఈనెలాఖరు రిటైర్ అవుతారని చివరకు తెలంగాణ న్యాయమూర్తులు మిగిలేది ఇద్దరేనని వినోద్ లెక్కలు చెప్పారు. ఖాళీగా ఉన్న 17పోస్టుల్లో 11 పోస్టులను బార్‌కౌన్సిల్ సభ్యుల ద్వారా భర్తీచేయాల్సిఉంటుందన్నారు. కాబట్టి 11పోస్టులను తెలంగాణ వారితోనే భర్తీ చేయాలని వినోద్ డిమాండ్ చేశారు. హైకోర్టు విభజనలో జరుగుతున్న ఆలస్యానికి నిరసనగా టీఆర్‌ఎస్‌ ఎంపీలు లోక్‌సభలో కూడా నిరసన తెలిపారు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News