బాబుగారి మాయల బుట్ట గుట్టు తెలిసిపోయిందా?

చంద్రబాబు ప్రభుత్వానికి పోలవరం పెద్ద సవాలుగా తయారైంది. 2018 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని సవాల్ చేసి ప్రకటించారు. మంత్రి దేవినేని ఉమా అయితే ఇప్పటికీ సవాల్ సవాలే అంటున్నారు. కానీ జాతీయప్రాజెక్ట్ అయిన పోలవరానికి నిధులు మాత్రం పారడం లేదు. ఏటా వంద కోట్లు, ఐదు వందల కోట్లతో కేంద్రం సరిపెడుతోంది. సరే ఏపీ ప్రభుత్వమే సొంతంగా డబ్బులు ఖర్చు పెడుతుందా అంటే అదీ లేదు. కేంద్రం నుంచి రూ. 3500 కోట్లు వస్తాయంటూ బడ్జెట్‌లో […]

Advertisement
Update: 2016-03-14 00:31 GMT

చంద్రబాబు ప్రభుత్వానికి పోలవరం పెద్ద సవాలుగా తయారైంది. 2018 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని సవాల్ చేసి ప్రకటించారు. మంత్రి దేవినేని ఉమా అయితే ఇప్పటికీ సవాల్ సవాలే అంటున్నారు. కానీ జాతీయప్రాజెక్ట్ అయిన పోలవరానికి నిధులు మాత్రం పారడం లేదు. ఏటా వంద కోట్లు, ఐదు వందల కోట్లతో కేంద్రం సరిపెడుతోంది. సరే ఏపీ ప్రభుత్వమే సొంతంగా డబ్బులు ఖర్చు పెడుతుందా అంటే అదీ లేదు. కేంద్రం నుంచి రూ. 3500 కోట్లు వస్తాయంటూ బడ్జెట్‌లో ప్రకటించి చేతులు దులుపుకుంది రాష్ట్ర ప్రభుత్వం. పరిస్థితి చూస్తుంటే 2018 నాటికి ప్రాజెక్ట్ పూర్తవడం అసాధ్యమని అందరూ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. పోలవరం పూర్తి కాకుండా 2019 ఎన్నికలకు వెళ్తే ఏం జరుగుతుందో చంద్రబాబుకు తెలుసు.

అందుకే ఆయన ఈ మధ్య హఠాత్తుగా ప్లేట్ ఫిరాయించారు. మొదట్లో ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని కేంద్రానికి చెప్పకుండానే రూ.16 వేల కోట్ల నుంచి రూ. 32 వేల కోట్లకు పెంచడమే కాకుండా మీరు నిధులిస్తే చాలు ప్రాజెక్ట్ తామే కడుతామని చెప్పిన చంద్రబాబుప్రభుత్వం ఇప్పుడు కొత్తపల్లవి అందుకుంది. కేంద్రం సరే అంటే ఈ క్షణమే, ఇప్పుడే పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్రానికి అప్పగిస్తామని చంద్రబాబు అసెంబ్లీ వేదికగా చాలా ఆవేశంగా ఇటీవల ప్రకటించారు. ఒకప్పుడు ప్రాజెక్ట్ తామే నిర్మిస్తాం … కేంద్రం డబ్బులిస్తే చాలని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఇలా ఒక్కసారిగా మాట మార్చడం వెనుక బీజేపీనీ ముంచే ఎత్తు ఉందని కమలనాథులు నిర్ధారణకు వచ్చారు. ఆదివారం విశాఖలో జరిగిన బీజేఎల్పీ భేటీలోనూ ఈ అంశంపై చర్చించారు.

పోలవరాన్ని కేంద్రం నెత్తిన వేసేందుకు బాబు సిద్ధమవడం వెనుక కుట్ర ఉందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ప్రాజెక్ట్ నిర్మాణం ఇప్పట్లో పూర్తి కాదన్న నిర్ధారణకు వచ్చాకే చంద్రబాబు ఈ ఎత్తు వేశారని అనుమానిస్తున్నారు. 2019లోపు ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే అందుకు కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని ప్రచారంచేసేందుకు చంద్రబాబు వ్యూహరచన చేశారని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్రం తీసుకోకుండా ఉండేలా ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారట. కేవలం నిధులు ఇచ్చే బాధ్యత మాత్రమే కేంద్రం తీసుకుంటే మంచిదని అభిప్రాయడపడ్డారు.

పోలవరం విషయంలో బాబు మాయల బుట్టలో బీజేపీ నేతలు పడకూడదని నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది. అదే సమయంలో చంద్రబాబుకు మరీ అంత ఇబ్బందిగా పరిస్థితి తయారైతే పోలవరాన్ని కేంద్రం మెడకు చుట్టించే నాయకులు కూడా బీజేపీలో ఉన్నారన్నది కూడా మరికొందరి అభిప్రాయం.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News