మీరు సబ్జెక్ట్ మాట్లాడవద్దు… ప్రశ్న మీకైనా అర్థం కావాలి కదా…?

రైతు రుణమాఫీ అంశంపై ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వాడీవేడిగా సభ సాగింది. రైతులకు బ్యాంకులు నోటీసులు ఇచ్చినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అని అడిగిన ప్రశ్నకు అలాంటిదేమీ లేదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమాధానం చెప్పడంపై  వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.  రైతులకు నోటీసులు ఇచ్చిన విషయం తమ దృష్టికి రాలేదని ప్రభుత్వం చెప్పడం దారుణమని వైసీపీ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి,  చెవిరెడ్డి, ఉప్పులేటి కల్పన అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఇందుకు స్పందించిన మంత్రి […]

Advertisement
Update: 2016-03-08 23:53 GMT

రైతు రుణమాఫీ అంశంపై ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వాడీవేడిగా సభ సాగింది. రైతులకు బ్యాంకులు నోటీసులు ఇచ్చినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అని అడిగిన ప్రశ్నకు అలాంటిదేమీ లేదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమాధానం చెప్పడంపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులకు నోటీసులు ఇచ్చిన విషయం తమ దృష్టికి రాలేదని ప్రభుత్వం చెప్పడం దారుణమని వైసీపీ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి, చెవిరెడ్డి, ఉప్పులేటి కల్పన అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఇందుకు స్పందించిన మంత్రి పుల్లారావు చరిత్రలో ఎక్కడా చేయని విధంగా తాము రుణమాపీ చేశామని చెప్పారు. రుణమాపీ సాధ్యం కాదని చెప్పిన వైసీపీకి దీనిపై మాట్లాడే అర్హత లేదని ఎదురుదాడి చేశారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న జగన్ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. అయితే పదేపదే స్పీకర్ మైక్ క‌ట్ చేయడంతో జగన్, కోడెల మధ్య వాగ్వాదం జరిగింది.

ఓట్లు వేయించుకునేందుకు ఎన్నికల సమయంలో మొత్తం రుణాలు మాపీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు రైతులను మోసం చేసిందని జగన్ ఆరోపించారు. బాబు సీఎం అయిన నాటికి 87వేల 612 కోట్లు రుణాలు ఉండగా… ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించింది కేవలం రూ. 7400 కోట్లు మాత్రమేనని అన్నారు. రెండేళ్లలో రైతు రుణాలపై వడ్డీలే 24 వేల కోట్లు అయ్యాయని జగన్ గుర్తు చేశారు. అధిక వడ్డీలు కట్టాల్సి వస్తోందన్నారు. ఈ అంశంపై నిరసన తెలిపి తాము సభ నుంచి వాకౌట్ చేస్తామని జగన్ అన్నారు. బాబు బావకే రుణమాఫీ కాలేదంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను జగన్ ప్రస్తావించబోగా స్పీకర్ అడ్డుతగిలారు . సబ్జెక్ట్ మాట్లాడవద్దంటూ మైక్ కట్ చేశారు. సబ్జెక్ట్ మాట్లాడకుండా నిరసన మాత్రమే తెలిపి వాకౌట్ చేయాలని సూచించారు. జగన్ తిరిగి మాట్లాడబోగా మళ్లీ మైక్ కట్ చేశారు స్పీకర్. సబ్జెక్ట్ మాట్లాడితే మైక్ ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఇందుకు జగన్ తీవ్రంగా స్పందించారు.

వాకౌట్ చేసేందుకు ముందు కనీసం ప్రశ్న కూడా చదవ‌నివ్వరా అని జగన్ ప్రశ్నించారు. అవసరం లేదు ప్రశ్న అందరికీ తెలుసని స్పీకర్ బదులిచ్చారు. ఇలా మూడునాలుగు సార్లు స్పీకర్ మైక్ కట్‌ చేశారు. ఓ దశలో వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తూ పోడియం వద్దకు వెళ్లేప్రయత్నం చేశారు. స్పీకర్ తీరును జగన్ తప్పుపట్టారు. కనీసం నిరసన తెలిపే ముందు తాము అడిగిన ప్రశ్న, ప్రభుత్వం చెప్పిన సమాధానాన్ని కూడా చదవనివ్వకపోతే ఎలా అని అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు రుణమాఫీ పేరుతో రైతులకు ప్రభుత్వం చేసిన మోసానికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు జగన్ ప్రకటించి వెళ్లిపోయారు.

Click on image to read:


Tags:    
Advertisement

Similar News