ఈ నవ్వు రగిలించిన చికాకు

‘’నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం,  నవ్వకపోవడం ఒక రోగం’’. ఇది వైఎస్‌ బతికున్నప్పుడు అసెంబ్లీలో చెప్పిన మాటలు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు. ఈ నవ్వును చూసి పలుమార్లు అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసేవారు. ఏంటి అధ్యక్ష ఇంత సీరియస్‌గా మాట్లాడుతుంటే ఆయన మాత్రం నవ్వుతున్నారు అని మండిపడేవారు చంద్రబాబు.  అప్పట్లో వైఎస్ నవ్వుతూ ఉన్నారంటే కారణం అధికార పక్షం ఆవేశపడకూడదన్న సూత్రం ఫాలో […]

Advertisement
Update: 2016-03-09 09:28 GMT

‘’నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం’’. ఇది వైఎస్‌ బతికున్నప్పుడు అసెంబ్లీలో చెప్పిన మాటలు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు. ఈ నవ్వును చూసి పలుమార్లు అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసేవారు. ఏంటి అధ్యక్ష ఇంత సీరియస్‌గా మాట్లాడుతుంటే ఆయన మాత్రం నవ్వుతున్నారు అని మండిపడేవారు చంద్రబాబు. అప్పట్లో వైఎస్ నవ్వుతూ ఉన్నారంటే కారణం అధికార పక్షం ఆవేశపడకూడదన్న సూత్రం ఫాలో కావడమే. పైగా ఎదుటివారు సీరియస్‌గా మాట్లాడుతున్నప్పుడు నవ్వడం ద్వారా వారికి మరింత చికాకు కలిగించడం. వైఎస్‌ కాలం నాటి ముచ్చట కాసేపు పక్కన పెడితే… చాలా కాలం తర్వాత ఏపీ అసెంబ్లీలో మళ్లీ నవ్వుపై వివాదం తలెత్తింది.

రాజధాని భూముల వ్యవహారంపై చంద్రబాబు సీరియస్‌గా కోపంగా సమాధానం చెబుతుంటే జగన్‌ నవ్వుతూ కనిపించారు. చంద్రబాబు సమాధానంలో పసలేదన్నట్టుగా నవ్వారు. జగన్ నవ్వు అధికార పక్షానికి తీవ్ర అసహనం కలిగించింది. జగన్ నవ్వును చూసి టీడీపీ నేతల కన్నా బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్ తట్టుకోలేకపోయారు. మైక్ తీసుకుని తీవ్రంగా మాట్లాడారు. చంద్రబాబు అంటే మోదీతోపాటు అద్వానీ, రాజ్‌నాథ్, అమిత్‌ షా లాంటి పెద్దపెద్ద వాళ్లు కూడా మర్యాద ఇస్తారు. ఈయన( జగన్‌) మాత్రం వెకిలిగా నవ్వుతున్నారు. ”ఏంటి అధ్యక్ష ఇది. ఆ నవ్వు మానుకోమనండి అధ్యక్ష” అని అన్నారు. ఒక తీవ్ర పదాన్ని కూడా వాడారు కామినేని.

మంత్రి కామినేనే కాదు బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు కూడా చంద్రబాబుకు సపోర్టుగా వచ్చారు. ”సీఎంగారు అంత సీరియస్‌గా మాట్లాడుతుంటే జగన్ అలా నవ్వడం ఏమిటి అధ్యక్ష ఇది పద్దతి కాదు” అని వ్యాఖ్యానించారు. అధికారపక్షం నుంచి అరడజను మంది మంత్రులు, ముఖ్యమంత్రి, పలువురు ఎమ్మెల్యేలు, మధ్యమధ్యలో బీజేపీ నేతలు దాడి చేస్తున్నా జగన్‌ నవ్వుతూ కనిపించడం అధికారపక్షానికి బాగానే చికాకు కలిగించినట్టు ఉంది.

Click on image to read:

 

Tags:    
Advertisement

Similar News