దరిద్రపు జాతి అనుకుని అంతం చేయాలనుకుంటున్నారా?

కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మ నాభం బాబు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. కాపు రిజర్వేషన్ల అలసత్వంపై తీవ్ర పదజాలంతో చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ లేఖలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కాని మా జాతికి రాలేదని భావిస్తున్నానని తెలిపారు. కాపులంటే మీకు దరిద్రపు జాతిగా కనబడుతున్నారా? లేక ఈ జాతిని అంతం చేయాలని ప్రతిమ పూనారా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని కోరుతున్నామే తప్ప మేము గొంతెమ్మ కొరికలు […]

Advertisement
Update: 2016-03-02 21:00 GMT

కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మ నాభం బాబు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. కాపు రిజర్వేషన్ల అలసత్వంపై తీవ్ర పదజాలంతో చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ లేఖలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కాని మా జాతికి రాలేదని భావిస్తున్నానని తెలిపారు. కాపులంటే మీకు దరిద్రపు జాతిగా కనబడుతున్నారా? లేక ఈ జాతిని అంతం చేయాలని ప్రతిమ పూనారా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని కోరుతున్నామే తప్ప మేము గొంతెమ్మ కొరికలు కోరడంలేదన్నారు. తమకు న్యాయబద్దంగా రావాల్సిన డబ్బులు మీ రెండెకెరాల ఎస్టేట్ నుంచి గానీ, చీకటి ఒప్పందం ద్వారా వచ్చిన డబ్బు నుంచి గానీ ఇవ్వమని అడగడంలేదని… కడుతున్న పన్నులనుంచే ఇవ్వమని లేఖలో డిమాండ్ చేశారు.

పట్టిసీమకు, పప్పు బెల్లాలకు, రాజధానికి కొబ్బరికాయ కొట్టడానికి, విదేశాలు తిరగడానికి, ప్రత్యేక విమానాల్లో విహరించడానికి, గెస్టు హౌసులకు, ఆఫీసులకు వేల కోట్లు నీళ్లలా ఖర్చు చేయడానికి డబ్బులుంటాయి కానీ, న్యాయబద్ధంగా తమ జాతికి రావాల్సిన ప్రయోజనాలను అడిగేసరికి రాష్ట్రం లోటు బడ్జెట్లో ఎలా వుంటుందని ప్రశ్నించారు. తక్షణం రూ. 500 కోట్లు కాపు కార్పోరేషన్ కి ఇస్తామని చెప్పి నిరాహార దీక్షను విరమింపజేశారని కానీ ఇప్పటి వరకు ఎటుంటి చర్యలను తీసుకోలేదని లేఖలో వ్యాఖ్యానించారు.

కాపు జాతిని ఎదో ఉద్దరించినట్టు సభలు, సమావేశాలు పెట్టి ,మీ కార్యకర్తలకే ఆ రుణాలను ఇస్తూ, కాపు నాయకులను ఇష్టానుసారంగా తిట్టించడమే పనిగా పెట్టుకున్నారా? అని లేఖలో ప్రశ్నించారు. మీ మీట విలువేంటో పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచినప్పుడే తెలుసని కానీ ఈ కాపుల మంచితనంతో ఈ ఒక్కసారికి మాట విన్నామని కానీ మాట నిలుపుకోలేకపోయారని చంద్రబాబుపై లేఖలో విరుచుకుపడ్డారు. కాపుల రిజర్వేషన్ల సమస్యలను 10వ తారీఖులోపు పరిష్కరించనిచో 11వ తారీఖు నుంచి మళ్లీ మా కార్యాచరణను మొదలుపెడతామని లేఖలో చంద్రబాబుపై మండిపడ్డారు.

Click on image to read:


Tags:    
Advertisement

Similar News