వైసీపీలోకి బైరెడ్డి?- నిజమా? లేక సీమపై నీళ్లు చల్లడమా?

మొన్నటివరకు  కర్నూలు జిల్లా వైసీపీలో పెద్ద లీడర్‌గా భూమానాగిరెడ్డి చలామణి అయ్యారు.అయితే ఆయన టీడీపీలో చేరిపోవడంతో  ఇప్పుడు కర్నూలు వైసీపీలో ఆ ప్లేస్ ఖాళీగా ఉంది. వెళ్లిపోయిన వారి స్థానంలో అంతకంటే బలమైన నాయకత్వాన్ని తయారు చేస్తామని జగన్ కూడా చెప్పారు.  ఈనేపథ్యంలో ఒక ప్రముఖ మీడియా సంస్థ కొత్త ఈక్వేషన్‌ను ప్రచురించింది.  రాయలసీమ ఉద్యమాన్ని నడుపుతున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వైసీపీలో చేరే యోచనలో ఉన్నారని కథనాన్ని ప్రచురించింది. భూమా కూడా వెళ్లిపోయిన నేపథ్యంలో బైరెడ్డి […]

Advertisement
Update: 2016-02-29 08:07 GMT

మొన్నటివరకు కర్నూలు జిల్లా వైసీపీలో పెద్ద లీడర్‌గా భూమానాగిరెడ్డి చలామణి అయ్యారు.అయితే ఆయన టీడీపీలో చేరిపోవడంతో ఇప్పుడు కర్నూలు వైసీపీలో ఆ ప్లేస్ ఖాళీగా ఉంది. వెళ్లిపోయిన వారి స్థానంలో అంతకంటే బలమైన నాయకత్వాన్ని తయారు చేస్తామని జగన్ కూడా చెప్పారు. ఈనేపథ్యంలో ఒక ప్రముఖ మీడియా సంస్థ కొత్త ఈక్వేషన్‌ను ప్రచురించింది. రాయలసీమ ఉద్యమాన్ని నడుపుతున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వైసీపీలో చేరే యోచనలో ఉన్నారని కథనాన్ని ప్రచురించింది.

భూమా కూడా వెళ్లిపోయిన నేపథ్యంలో బైరెడ్డి రాకకు లైన్ క్లియర్ అయినట్టేనని రాసింది. అందుకే ఇటీవల చంద్రబాబును పదేపదే తిడుతున్న బైరెడ్డి … జగన్‌ను మాత్రం ఒక్కమాట కూడా అనడం లేదని విశ్లేషించింది. బైరెడ్డి సాధారణ రాజకీయ నాయకుడే అయితే ఆయన మరో పార్టీలో చేరుతున్నారంటే పెద్దగా అనుమానం అక్కర్లేదు. అయితే ఆయన రాయలసీమ హక్కుల కోసం ఒంటరి పోరాటం చేస్తున్నారు. అంతే కాదు సీమ జనంలో చైతన్యం కలిగించేందుకు బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ సమయంలో ఆయన పార్టీ మారుతున్నారని కథనం రావడంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రాయలసీమను చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని చాలాకాలంగా బైరెడ్డి ఆరోపిస్తూ వస్తున్నారు. బస్సు యాత్రలోనూ అలాగే విమర్శించడం ఖాయం. ఈ సమయంలో బైరెడ్డి వైసీపీలో చేరుతున్నారు… జగన్‌తో టచ్‌లో ఉన్నారు అని ప్రచారం చేయడం ద్వారా బైరెడ్డి బస్సు యాత్రకు రాజకీయం అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. జగన్‌ను విమర్శించడం లేదు కాబట్టి బైరెడ్డిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వారిని తిడితే ఏమొస్తుంది. అయినా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ప్రస్తుతం కర్నూలు వైసీపీలో పరిస్థితుల దృష్ట్యా బైరెడ్డి ఆ పార్టీలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే!

Click on image to read:

Tags:    
Advertisement

Similar News