మొన్న షకలక శంకర్... నేడు ఛమ్మక్ చంద్ర

 మోస్ట్ పాపులర్ టీవీ షో జబర్దస్త్ కు సంబంధించి నటులంతా ఒక్కో వివాదంలో కూరుకుపోతున్నారు. మొన్నటికి మొన్న షకలక శంకర్ వార్తల్లో వ్యక్తిగా మారాడు. ఫుల్లుగా తాగొచ్చి షూటింగ్ లో పాల్గొన్నాడు. మొత్తం షూటింగ్ ను రసాభాస చేశాడు. దీంతో అతడ్ని జబర్దస్త్ నుంచి తొలిగించారు. తాజాగా ఛమ్మక్ చంద్ర వివాదాస్పదమయ్యాడు. స్వాతి అనే టీవీ యాంకర్ చమ్మక్ చంద్రపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. చమ్మక్ చంద్రను ఉమెనైజర్ (స్త్రీలోలుడు)గా చెప్పుకొచ్చిన స్వాతి… దానికి సంబంధించి తన […]

Advertisement
Update: 2016-02-25 01:46 GMT
మోస్ట్ పాపులర్ టీవీ షో జబర్దస్త్ కు సంబంధించి నటులంతా ఒక్కో వివాదంలో కూరుకుపోతున్నారు. మొన్నటికి మొన్న షకలక శంకర్ వార్తల్లో వ్యక్తిగా మారాడు. ఫుల్లుగా తాగొచ్చి షూటింగ్ లో పాల్గొన్నాడు. మొత్తం షూటింగ్ ను రసాభాస చేశాడు. దీంతో అతడ్ని జబర్దస్త్ నుంచి తొలిగించారు. తాజాగా ఛమ్మక్ చంద్ర వివాదాస్పదమయ్యాడు. స్వాతి అనే టీవీ యాంకర్ చమ్మక్ చంద్రపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. చమ్మక్ చంద్రను ఉమెనైజర్ (స్త్రీలోలుడు)గా చెప్పుకొచ్చిన స్వాతి… దానికి సంబంధించి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని ప్రకటించింది. చమ్మక్ చంద్ర రాసలీలలకు సంబంధించి ఏకంగా వీడియోలు ఉన్నాయని చెబుతోంది. కేవలం ఇవే కాకుండా… ఎంతోమంది యాంకర్లకు డబ్బు ఇవ్వకుండా చంద్ర ఎగ్గొట్టాడని ఆమె ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపై జబర్దస్ట్ యాజమాన్యం సీరియస్ గా ఉంది. స్వాతి చేస్తున్న ఆరోపణలు నిజమని తేలితే…. షకలక శంకర్ కు పట్టిన గతే ఛమ్మక్ చంద్రకు కూడా పట్టడం ఖాయం.
Tags:    
Advertisement

Similar News