అవినీతి విజృంభణపై సీమ సీనియర్ నేత చెప్పిన లాజిక్

కొంతకాలంగా ఏపీలో అవినీతి పతాకస్థాయికి చేరిందన్న అభిప్రాయం ఇటీవల వ్యక్తమవుతోంది. స్వయంగా సీఎం కుమారుడు లోకేష్‌పైనా ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. పట్టిసీమ మొదలు, చంద్రన్న కానుక వరకు… ఇసుక నుంచి బెరైటీస్ వరకు వందల కోట్ల అవినీతి జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గతంతో పోలిస్తే అవినీతి మోతాదు మరీ ఎక్కువైందన్న అభిప్రాయం అటు నాయకుల్లో ఇటు ప్రజల్లోనూ ఉంది. ఏపీలో అవినీతి ఈ రేంజ్‌లో పెరగడానికి కారణం ఏమిటన్నది చాలా మందికి అంతుచిక్కడం లేదు. ఏపీలో, అది బాబు పాలనలో అవినీతి […]

Advertisement
Update: 2016-02-13 21:58 GMT

కొంతకాలంగా ఏపీలో అవినీతి పతాకస్థాయికి చేరిందన్న అభిప్రాయం ఇటీవల వ్యక్తమవుతోంది. స్వయంగా సీఎం కుమారుడు లోకేష్‌పైనా ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. పట్టిసీమ మొదలు, చంద్రన్న కానుక వరకు… ఇసుక నుంచి బెరైటీస్ వరకు వందల కోట్ల అవినీతి జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గతంతో పోలిస్తే అవినీతి మోతాదు మరీ ఎక్కువైందన్న అభిప్రాయం అటు నాయకుల్లో ఇటు ప్రజల్లోనూ ఉంది. ఏపీలో అవినీతి ఈ రేంజ్‌లో పెరగడానికి కారణం ఏమిటన్నది చాలా మందికి అంతుచిక్కడం లేదు.

ఏపీలో, అది బాబు పాలనలో అవినీతి ఈ రేంజ్‌లో పరగటంపై సీమ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ సీనియర్‌ ప్రజాప్రతినిధి ఒకరు సన్నిహితుల దగ్గర ఆసక్తికరమైన కారణాలు వివరించారట. పదేళ్ల పాటు అధికారంలో లేకపోవడంతో టీడీపీ నేతల గల్లాపెట్టెలు ఖాళీ అవడం అందులో ఒక కారణం కాగా… భవిష్యత్ దర్శనం మరో కారణమట. రాజధాని నిర్మాణంలో నత్తనడక, ఎన్నికల హామీల అమలులో విఫలమవడంతో పాటు, కుల పంచాయతీలు మొదలవడం వంటి పరిణామాలు అధికార పార్టీ నేతల్లో వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ధీమా సన్నగిల్లిందట. చూస్తుంటే 2019లో తిరిగి అధికారంలోకి వస్తామో లేదో అన్న అనుమానం ప్రజాప్రతినిధుల్లో అధికంగా ఉందట.

ఈ నేపథ్యంలో ఉన్న ఈమూడేళ్లలోనే మనీపరంగా సెటిల్‌ అయితే ఆ తర్వాత దేవుడున్నారన్న భావన చాలా మందిలో వ్యక్తమవుతోందని సీనియర్ నేత విశ్లేషించారని చెబుతున్నారు. 2019 తర్వాత కూడా తిరిగి అధికారంలోకి వస్తామన్న ధీమా ఉండి ఉంటే డబ్బులు మరీ ఇంత వేగంగా సంపాదించాలన్న భావన నేతల్లో ఉండదని… ఆ ధీమా లేకపోవడం వల్లే ఇలా కొంచెం తొందరపడుతున్నారని ఆ సీనియర్ నేత అభిప్రాయపడ్డారని సమాచారం.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News