నిద్రలేపి తన్నించుకోవడం అంటే ఇదే !

రాయలసీమను నేరమయ ప్రాంతంగా చిత్రీకరించే ప్రక్రియ కొంతకాలంగా సాగుతోంది. రాయలసీమ అంటేనే నరుక్కోవడం, చంపుకోవడం అన్నట్టుగా కొన్ని వర్గాల చేతిలో బంధీగా ఉన్న సినిమా పరిశ్రమ ఎప్పటి నుంచో చేస్తోంది. ఒకప్పుడు సీమతో పాటు తెలంగాణను నెగిటివ్ టచ్‌లో చూపించేవారు. అయితే ఇప్పుడు తెలంగాణను నెగిటివ్‌గా చూపిస్తే కటౌట్ చినిగిపోతుందని సినిమావాళ్లకు తెలుసు. అందుకే సినిమా వాళ్ల నుంచి తెలంగాణకు విముక్తి కలిగింది. రాయలసీమవాసులు మాత్రం ఇప్పటికీ బాధితులే. సినిమావాళ్లే అనుకుంటే ఇటీవల చంద్రబాబు కూడా బయలుదేరారు. […]

Advertisement
Update: 2016-02-11 03:27 GMT

రాయలసీమను నేరమయ ప్రాంతంగా చిత్రీకరించే ప్రక్రియ కొంతకాలంగా సాగుతోంది. రాయలసీమ అంటేనే నరుక్కోవడం, చంపుకోవడం అన్నట్టుగా కొన్ని వర్గాల చేతిలో బంధీగా ఉన్న సినిమా పరిశ్రమ ఎప్పటి నుంచో చేస్తోంది. ఒకప్పుడు సీమతో పాటు తెలంగాణను నెగిటివ్ టచ్‌లో చూపించేవారు. అయితే ఇప్పుడు తెలంగాణను నెగిటివ్‌గా చూపిస్తే కటౌట్ చినిగిపోతుందని సినిమావాళ్లకు తెలుసు. అందుకే సినిమా వాళ్ల నుంచి తెలంగాణకు విముక్తి కలిగింది.

రాయలసీమవాసులు మాత్రం ఇప్పటికీ బాధితులే. సినిమావాళ్లే అనుకుంటే ఇటీవల చంద్రబాబు కూడా బయలుదేరారు. రాష్ట్రంలో ఎక్కడ నేరం జరిగినా రాయలసీమవాళ్ల ప్రమేయం ఉందని సీఎం హోదాలో చెప్పడం పరిపాటిగా మారింది. తుని ఘటనపైనా ఇదే ఆరోపణ చేశారు. చంద్రబాబుకు తోడుగా మూవీ మేధావి మురళీ మోహన్ కూడా అదే పల్లవి ఆలపించారు. అయితే చంద్రబాబు, మురళీ మోహన్ ఇలా సీమను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడంపై రాయలసీమ అభివృద్ధి సమితి తీవ్రంగా స్పందించింది. అసలు రాష్ట్రంలో నేరాలు ఎక్కడ అధికంగా జరుగుతున్నాయన్న దానిపై గణాంకాలతో సహా వెల్లడించింది.

2014 ఏడాదికి చూస్తే అత్యధిక రేప్‌ కేసులు నమోదైన జిల్లాగా చంద్రబాబుకు ప్రియమైన కృష్ణా జిల్లా నిలిచింది. 2014లో కృష్ణా జిల్లాలో 144 రేపు కేసులు, పశ్చిమగోదావరి జిల్లాలో 139 , తూర్పుగోదావరి జిల్లాలో 77 రేపు కేసులు నమోదయ్యాయని రాయలసీమ అభివృద్ధి సమితి నేతలు మీడియా సమావేశంలో వెల్లడించారు. తరుచు చంద్రబాబు కించపరిచే కడప జిల్లాలో కేవలం 39 అత్యాచారకేసులు నమోదయ్యాయని అధికారిక లెక్కలను ప్రస్తావించారు. కర్నూలులో 31, అనంతపురం జిల్లాలో 35, చిత్తూరు జిల్లాలో 49 ఆత్యాచార కేసులు నమోదయ్యాయని రిటైర్డ్ పోలీస్ అధికారి హనుమంతరెడ్డి వెల్లడించారు. మిగిలిన నేరాల రేటు చూస్తే గుంటూరు జిల్లాలో ప్రతి లక్ష జనాభాకు 620 , కృష్ణా జిల్లాలో 623 కేసులు నమోదవుతున్నాయని ప్రకటించారు.

కడప జిల్లాలో క్రైమ్ రేటు ప్రతి లక్ష జనాభాకు కేవలం 182 ఉందని చెప్పారు. వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు పనిగట్టుకుని రాయలసీమపై తప్పుడు ప్రచారంచేస్తున్నారని సమితి నేతలు మండిపడ్డారు. చంద్రబాబు, మురళీమోహన్ రాయలసీమను పదేపదే కించపరుస్తున్నా రాయలసీమ నేతలు నోరు మెదపకపోవడం బాధాకరమని సమితి నేతలు ఆవేదన చెందారు. మొత్తం మీద పడుకున్న రాయలసీమ వాళ్లతో చంద్రబాబు ప్రభుత్వం లేపి తన్నించుకుంటున్నట్టుగా వ్యవహారం తయారైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్రైమ్ రేట్ చంద్రబాబుకు ఇష్టమైన జిల్లాల్లోనే అధికంగా నమోదవుతోంది. మరి ఆయన అసలు నిజాన్ని దాచి తనను కన్నతల్లి రాయలసీమపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో మరి! .

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News