టీఆర్‌ఎస్‌లో టీటీడీపీ విలీనానికి ఎర్రబెల్లి లేఖ

టీటీడీపీకి ఇప్పుడు మరో భయం పట్టుకుంది. టీడీఎల్పీ నేతగా ఉన్న ఎర్రబెల్లి టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆయన ఇప్పుడేం చేస్తారన్న దానిపై టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. టీటీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టుగా టీడీఎల్పీ నేత హోదాలో ఎర్రబెల్లి దయాకర్‌రావు త్వరలోనే స్పీకర్‌కు లేఖ ఇచ్చే యోచనలో ఉన్నారని చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ తరపున 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే 9 మంది టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. మరో ముగ్గురు కూడా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా […]

Advertisement
Update: 2016-02-10 10:32 GMT

టీటీడీపీకి ఇప్పుడు మరో భయం పట్టుకుంది. టీడీఎల్పీ నేతగా ఉన్న ఎర్రబెల్లి టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆయన ఇప్పుడేం చేస్తారన్న దానిపై టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. టీటీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టుగా టీడీఎల్పీ నేత హోదాలో ఎర్రబెల్లి దయాకర్‌రావు త్వరలోనే స్పీకర్‌కు లేఖ ఇచ్చే యోచనలో ఉన్నారని చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ తరపున 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే 9 మంది టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. మరో ముగ్గురు కూడా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఎర్రబెల్లి చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో టీటీడీపీకి విలీనం ముప్పు పొంచి ఉంది. దీనిపై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఎమ్మెల్యేల తీర్మానం వల్ల పార్టీల విలీనం జరిగే అవకాశం లేదన్నారు. ఒకవేళ అధికార పార్టీ ఆ పనిచేస్తే కోర్టుకు వెళ్తామన్నారు రేవంత్ రెడ్డి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News