తెలంగాణ ప్రజలకు  కేంద్ర మాజీ మంత్రి వార్నింగ్

ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించకపోవడంపై ఆ పార్టీ నేతలు అప్పుడప్పుడు ఓపెన్ అయిపోతున్నారు. తాజాగా   కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత బలరాం నాయక్‌ తెలంగాణ ప్రజలపై అసహనం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడంపై తీవ్రంగా స్పందించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన కాంగ్రెస్ సభలో ప్రసంగించిన బలరాం నాయక్… వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించకపోతే తెలంగాణను తిరిగి ఆంధ్రతో కలిపిస్తేమని హెచ్చరించారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో ప్రతి […]

Advertisement
Update: 2015-10-09 22:20 GMT

ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించకపోవడంపై ఆ పార్టీ నేతలు అప్పుడప్పుడు ఓపెన్ అయిపోతున్నారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత బలరాం నాయక్‌ తెలంగాణ ప్రజలపై అసహనం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడంపై తీవ్రంగా స్పందించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన కాంగ్రెస్ సభలో ప్రసంగించిన బలరాం నాయక్… వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించకపోతే తెలంగాణను తిరిగి ఆంధ్రతో కలిపిస్తేమని హెచ్చరించారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో ప్రతి ఒక్కరు హస్తం గుర్తుకు ఓటేయాల్సిందేనని హుకుం జారీ చేశారు. ”అవును.. నా మాటల్లో తప్పేముంది.. బరాబర్ ఆంధ్రాలో కలుపుతం.. ఏమైతది?” అని అన్నారు. సోనియా దయతో తెలంగాణ వచ్చినా ఓటు మాత్రం కాంగ్రెస్‌కు వేయకుండా టీఆర్‌ఎస్‌కు వేశారని బలరాం నాయక్‌ విమర్శించారు.
బలరాం నాయక్ ప్రజలకు వార్నింగ్ ఇచ్చిన సమయంలో సభావేదికపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, భట్టివిక్రమార్క కూడా ఉన్నారు. బలరాంనాయక్‌కు వారించే ప్రయత్నం మాత్రం చేయలేదు.

Tags:    
Advertisement

Similar News